AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: ఒక్కసారి డిపాజిట్ చేస్తే.. ప్రతి నెలా మీ అకౌంట్లో రూ.5,550.. ఈ పోస్టాఫీసు సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడైనా దాచుకుని, దాని నుంచి ప్రతి నెలా కొంత ఆదాయం రావాలని కోరుకుంటున్నారా.. అయితే మీకోసం పోస్టాఫీసు ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. ఐదేళ్ల పాటు ప్రతి నెలా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి. నెలకు రూ.5,500 కంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉన్న ఈ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Post Office: ఒక్కసారి డిపాజిట్ చేస్తే.. ప్రతి నెలా మీ అకౌంట్లో రూ.5,550.. ఈ పోస్టాఫీసు సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?
Post Office Monthly Income Scheme
Krishna S
|

Updated on: Jan 09, 2026 | 7:30 AM

Share

ఈ మధ్యకాలంలో చాలా మంది పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. రిస్క్ తక్కువ మంచి ఆదాయం ఉండడే దీనికి కారణం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి పోస్టాఫీసు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. ముఖ్యంగా రిటైర్ అయిన వారికి, గృహిణులకు, రిస్క్ లేని ఆదాయం కావాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం ఒక వరప్రసాదం. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. అంటే ప్రస్తుతం ఉన్న 7.4 శాతం గరిష్ట వార్షిక వడ్డీ రేటు ప్రయోజనం పెట్టుబడిదారులకు యధావిధిగా అందుతుంది.

నెలకు రూ.5,550 ఆదాయం ఎలా వస్తుంది?

ఈ పథకంలో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే, ఐదేళ్ల పాటు ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. సింగ్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ మీరు రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు సుమారు రూ.5,550 వడ్డీని పొందవచ్చు. జాయింట్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు చేరవచ్చు. ఐదేళ్ల తర్వాత మీరు పెట్టిన అసలు మొత్తం మీకు తిరిగి ఇవ్వబడుతుంది.

ఖాతా ఎలా తెరవాలి?

ఈ పథకంలో చేరడానికి కనీసం రూ.1,000 తో ఖాతా ప్రారంభించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా పోస్టాఫీసులో ఒక సేవింగ్స్ ఖాతా ఉండాలి. ప్రతి నెలా వచ్చే వడ్డీ నేరుగా మీ సేవింగ్స్ ఖాతాలో జమ చేయబడుతుంది.

ఈ పథకం ఐదేళ్ల కాలపరిమితి కలిగి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత కావాలనుకుంటే మీ అసలు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు లేదా మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రభుత్వ గ్యారెంటీతో లాభం పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి