ప్రధాన ద్వారం వద్ద గణపతిని ప్రతిష్టించారా? ఈ వాస్తు టిప్స్ పాటిస్తే మరింత అదృష్టం
హిందూ మతంలో, ఏదైనా శుభ కార్యం ప్రారంభించే ముందు గణేశుడిని పూజించే సంప్రదాయం ఉంది, ఎందుకంటే శ్రీ గణేశుడిని అడ్డంకులను తొలగించే దేవుడుగా భావిస్తారు. గణేశుడు శుభాలను కలిగించే దేవుడు. అందుకే చాలా మంది తమ ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహం లేదా చిత్రం పటం ఉంచుతారు. అయితే, ఇందుకు కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు.

హిందూ మతంలోని దేవీదేవతల్లో వినాయుడు లేదా గణపతికి ఎంతో విశిష్టత ఉంది. ఏ కార్యక్రమం చేపట్టినా గణేశుడికి మొదటి పూజ చేస్తారు. ఆ తర్వాత ఏ దేవుడినైనా పూజిస్తారు. ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కోసం ప్రజలు తరచుగా వారి ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణేశ విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే, వాస్తు శాస్త్రం, పురాణాల ప్రకారం ప్రధాన ద్వారం వద్ద గణేశ విగ్రహాన్ని ఉంచేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే వ్యతిరేక ఫలితాలు కూడా పొందవచ్చు.
హిందూ మతంలో, ఏదైనా శుభ కార్యం ప్రారంభించే ముందు గణేశుడిని పూజించే సంప్రదాయం ఉంది, ఎందుకంటే శ్రీ గణేశుడిని అడ్డంకులను తొలగించే దేవుడుగా భావిస్తారు. గణేశుడు శుభాలను కలిగించే దేవుడు. కానీ, ఆయన సంస్థాపనలో ఒక చిన్న పొరపాటు కూడా సానుకూల శక్తిని ప్రతికూలంగా మారుస్తుంది. అందువల్ల, ప్రధాన ద్వారం వద్ద గణేశ విగ్రహాన్ని ఉంచేటప్పుడు.. ‘పీఠం నుంచి పీఠం వరకు’ అనే నియమాన్ని పాటించాలి.
కొన్ని పౌరణికాల ప్రకారం.. గణేశుడి శరీరంలోని వివిధ భాగాలు వేర్వేరు శక్తులను కలిగి ఉంటాయి. మొత్తం విశ్వం గణేశుడి కడుపులో ఉంది. జ్ఞానం అతని నుదిటిపై ఉంటుంది. కానీ, అతని వీపు ‘పేదరికం’ యొక్క నివాసంగా పరిగణించబడుతుందని చెబుతారు. అందుకే, గణేశుడి వీపు ఎప్పుడూ ఇంటి లోపలి వైపు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. గణేశుడి విగ్రహాన్ని ప్రధాన ద్వారం వెలుపల ఉంచితే, దాని వీపు ఇంటి వైపు ఉంటుంది. అలా చేయడం వల్ల ఇంట్లోకి పేదరికం వస్తుందని, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని నమ్ముతారు.
మీరు ప్రధాన ద్వారం వద్ద గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకుంటే.. వాస్తు ప్రకారం ఒక ప్రత్యేక నియమాన్ని పాటించాలి.
జంట విగ్రహాలు: మీరు ప్రధాన ద్వారం తలుపు బయట ఒక విగ్రహాన్ని ప్రతిష్టించి ఉంటే.. అదే స్థలంలో లోపల గణేశుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచండి.
వెనుక నుంచి వెనుకకు.. లోపలి, బయటి విగ్రహాల వెనుక భాగాలు ఒకదానికొకటి ముడిపడి ఉండాలి. ఇది ఇంట్లో దేవుని వెనుక భాగం కనిపించకుండా నిరోధిస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.
దృష్టి ప్రాముఖ్యత: గణేశుడి దృష్టి ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉండాలి. తద్వారా ఆయన ఆశీస్సులు ఇంటి సభ్యులపై ఉంటాయి.
తొండం దిశ: ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా ఇంటి లోపల ఎడమవైపున తొండం మడిచి ఉంచిన గణేశుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణిస్తారు. ఎందుకంటే ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితిలో ఉంటుంది.
పరిశుభ్రత: ప్రధాన ద్వారం వద్ద విగ్రహాన్ని ప్రతిష్టించిన చోట పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అక్కడ బూట్లు, చెప్పులు ఉంచకూడదు.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలు, వాస్తుశాస్త్రం, అందుబాటులో ఉన్న వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని TV9 ధృవీకరించదు.
