AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: రాత్రి కాదు.. పగలు చూసిన భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతున్న హార్రర్ సిరీస్..

నిజానికి హారర్, దెయ్యాల సినిమాలు చూడాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కానీ ఒంటరిగా చూసేందుకు భయంతో వణికిపోతుంటారు. అలాగే కొన్ని చిత్రాలు చూసిన తర్వాత, ఎవరో మీ వెనుక నిలబడి ఉన్నట్లుగా లేదా తలుపు చాటు నుండి మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా నిరంతరం అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ వెబ్ సిరీస్ గురించే మీకు చెప్పబోతున్నాం.

Cinema OTT: రాత్రి కాదు.. పగలు చూసిన భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతున్న హార్రర్ సిరీస్..
Cinema (2)
Rajitha Chanti
|

Updated on: Mar 24, 2026 | 4:14 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో ఓ హారర్ వెబ్ సిరీస్ దూసుకుపోతుంది. ఆ కంటెంట్ చూస్తున్నప్పుడు మీకు ఒళ్లు గగుర్పాటు కలుగుతున్నట్లుగా.. మీ వెనకే ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ మీకు ఖచ్చితంగా ఒక విభిన్నమైన భయానుభూతిని అందిస్తుంది. ఈ సిరీస్ చూసిన తర్వాత దూరం నుండి మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తుంది. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు’ది వాకింగ్ డెడ్’. 2010లో ప్రారంభమైన ఈ సిరీస్ క్రేజ్ ఇప్పటికీ అంతే బలంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ సిరీస్‌కు సంబంధించిన 11 సీజన్లు విడుదల కాగా, వాటిలోని 177 ఎపిసోడ్లు ప్రేక్షకులను పిచ్చెక్కించాయి.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

రాబర్ట్ కిర్క్‌మన్ కామిక్ పుస్తకం ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇది నడిచే శవాలు లేదా జాంబీల ప్రపంచం, దాని నుండి తప్పించుకోవడం అసాధ్యం అనే అంశాల ఆధారంగా తెరకెక్కించారు. కథ ప్రారంభంలోనే పోలీస్ అధికారి అయిన రిక్ గ్రైమ్స్ కోమా నుండి మేల్కొని దిగ్భ్రాంతికి గురవుతాడు. ఒక భయంకరమైన వైరస్ ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రజలు ఇకపై మానవులుగా లేరు, కానీ జాంబీలుగా మారిపోయారు. నగరాలు నిర్మానుష్యంగా ఉన్నాయి, నరమాంస భక్షక జాంబీలు మాత్రమే వీధుల్లో తిరుగుతున్నాయి. ఈ నరకం నుండి తప్పించుకుని, ప్రాణాలతో బయటపడటానికి రిక్, అతని సహచరులు చేసే భయంకరమైన ప్రయాణాన్ని ఈ సిరీస్ చూపిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

‘ది వాకింగ్ డెడ్’ సిరీస్ IMDbలో 8.1 అనే భారీ రేటింగ్‌ను పొందింది. ఈ సిరీస్‌లో నార్మన్ రీడస్, మెలిస్సా మెక్‌బ్రైడ్, లారెన్ కోన్ , జెఫ్రీ డీన్ మోర్గాన్ వంటి ప్రముఖ నటులు అద్భుతంగా నటించారు. ఈ 177 ఎపిసోడ్‌లను చూసే ధైర్యం మీకు ఉంటే, మీరు ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us