AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. ‘ధురంధర్ 2’ పై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో స్టార్ ఆర్టిస్ట్ రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ప్రేక్షకులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Dhurandhar 2: ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్
Rajinikanth
Basha Shek
|

Updated on: Mar 24, 2026 | 2:55 PM

Share

బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 ప్రభంజనం కొనసాగుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో హీరో రణ్ వీర్ సింగ్ నటించిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 750 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేసింది. సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం ధురంధర్ 2 సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. అలాగే సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ధురంధర్ ది రివేంజ్ సినిమాను వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆదిత్య ధర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘ఎంత అద్భుతమైన సినిమా. ధురందర్ 2! ఆదిత్య ధర్ బాక్సాఫీస్ బాప్. రణ్‌వీర్‌కు, చిత్ర బృందానికి అభినందనలు. ఇది ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా. జై హింద్,’ అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.

‘జియో స్టూడియోస్’ నిర్మించిన ఈ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలోని పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. అంతేకాదు మొదటి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 761 కోట్లు వసూలు చేసి ఆల్-టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారత మార్కెట్లో రూ. 300 కోట్ల క్లబ్‌లో అత్యంత వేగంగా ప్రవేశించిన చిత్రంగా ధురంధర్ 2 నిలిచింది. ఇక బుక్ మై షోలో ఒక గంటలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన రికార్డు కూడా దీని పేరిట ఉంది. విదేశాల్లో తన మొదటి వారాంతంలోనే సుమారు రూ. 210 కోట్లు వసూలు చేసి, విదేశాలలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

రజనీకాంత్ ట్వీట్..

ఆదిత్య ధర్ దర్శకత్వం, రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. . దేశభక్తి కథాంశం ఉన్న ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేస్తోంది. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us