హిట్స్ ఉన్నా అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే.. 

Rajeev 

24  march 2026

 ప్రియాంక మోహన్.. చేసింది తక్కువ సినిమాలే కాకపోతే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ అమ్మడు.

తొలి సినిమానే నేచురల్ స్టార్ నానికి జోడీగా నటించింది. నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ చిన్నదానికి మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఆతర్వాత శర్వానంద్ తో కలిసి శ్రీకారం అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో తమిళ్ కు చెక్కేసింది.

అక్కడ వరుసగా సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. శివకార్తికేయన్, సూర్యలాంటి హీరోలతో కలిసి నటించింది ఈ చిన్నది.

ఇక ఇక తిరిగి తెలుగులో నానితో కలిసి సరిపోదా శనివారం అనే సినిమా చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓజీ సినిమాలోనూ నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే కూడా ఈ అమ్మడికి చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు.