ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. సూర్యకిరణాలు నేరుగా స్వామివారి మూల విరాట్టు పాదాలను తాకాయి. ఈ దివ్య దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.