రాజస్థాన్‌లో జన్మించిన రవీంద్ర కౌశిక్, 23 ఏళ్ల వయసులో రా ఏజెంట్‌గా మారారు. నబీ అహ్మద్ షాకిర్‌గా పాకిస్థాన్‌లో గూఢచర్యం చేసి, అక్కడి సైన్యంలో మేజర్‌గా ఎదిగారు. భారతదేశానికి కీలక సమాచారం అందించి వేలాది సైనికుల ప్రాణాలను కాపాడారు. ఇందిరా గాంధీ బ్లాక్ టైగర్ బిరుదు ఇచ్చిన కౌశిక్, దశాబ్దాల చిత్రహింసలు అనుభవించినా దేశ రహస్యాలను బయటపెట్టలేదు.