AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toll Charges: కేంద్రం సంచలన నిర్ణయం.. టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ పూర్తిగా బంద్.. ఇక నుంచి ఎలా చెల్లించాలంటే..?

వాహనదారులకు బిగ్ షాక్. టోల్ ఛార్జీ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నగదు పేమెంట్లను బంద్ చేసింది. ఇక నుంచి ఖచ్చితంగా ఆన్‌లైన్ ద్వారానే టోల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. టోల్ గేట్ల వద్ద ఈ కొత్త రూల్ తీసుకొస్తుంది.

Toll Charges: కేంద్రం సంచలన నిర్ణయం.. టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ పూర్తిగా బంద్.. ఇక నుంచి ఎలా చెల్లించాలంటే..?
Toll Charges
Venkatrao Lella
|

Updated on: Mar 24, 2026 | 2:43 PM

Share

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ గేట్ల వద్ద వాహనదారులకు షాకిచ్చేలా ఓ ప్రకటన చేసింది. అదేంటంటే.. ఇక నుంచి టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజును నగదు రూపేణా చెల్లించడానికి కుదరదు. అంటే లిక్విడ్ క్యాష్ రూపంలో టోల్ ఛార్జీలు చెల్లించడం ఇక వీలు కాదు. కేవలం ఫాస్టాగ్ ద్వారా మాత్రమే టోల్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో టోల్ ఫీజులను పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం అమలు చేయనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీనిని వర్తింపచేయనున్నట్లు మోదీ సర్కార్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఎన్‌హెచ్ఏఐ తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొంది.

క్యాష్ పేమెంట్స్ బంద్

ఇప్పటివరకు నగదు రూపంలో టోల్ చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉండేవి. ఫాస్టాగ్ చెల్లింపులకు ప్రత్యేక లైన్లు, నగదు రూపంలో కట్టేవారికి అదనంగా కొన్ని లైన్లు ఉండేవి. కానీ ఇక నుంచి ఈ అదనపు లైన్లు ఉండవ్. కేవలం ఫాస్టాగ్ లైన్లు మాత్రమే ఉంటాయి. ఇక నుంచి నగదు రూపంలో టోల్ రుసుం చెల్లించడం వీలు కాదని, పూర్తిగా డిజిటల్ విధానంలోనే కట్టాల్సి ఉంటుందని ఎన్‌హెచ్ఏఐ ఎక్స్‌లో రాసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు ఈ కొత్త విధానం తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో వాహనదారులు దీనిని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. లేకపోతే టోల్ గేట్ల వద్ద ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించింది.

యూపీఐ ద్వారా చెల్లింపులు

“టోలింగ్ ఎక్స్‌పీరియన్స్ దిశగా అడుగులు పడ్డాయి. నేషనల్ హైవేస్ ఫీజు ప్లాజాల వద్ద ఏప్రిల్ 1వ తేదీ నుంచి క్యాష్ పేమెంట్స్ సర్వీసులను డిస్‌కంటిన్యూ చేస్తున్నాం. ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 1,150కిపైగా టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించడం, లేన్ల ద్వారా వాహన రాకపోకలను మెరుగుపర్చడం, వేగవంతమైన టోల్ చెల్లింపులను స్వీకరించడం దీని ఉద్దేశం. 98 శాతంకిపైగా ఫాస్టాగ్ వినియోగం, డిజిటల్ చెల్లింపు ఎంపికలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. టోల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది” అని ఎన్‌హెచ్‌ఏఐ ఎక్స్‌లో పేర్కొంది. కాగా ఇప్పటివరకు క్యాష్ రూపంలో టోల్ ఫీజు చెల్లించేవారి నుంచి అదనపు ఛార్జిలు వసూలు చేస్తున్నారు. ఇప్పటినుంచి అసలు ఆ విధానమే బంద్ కానుంది. దీంతో ఇక నుంచి టోల్ చెల్లించాలంటే ఫాస్టాగ్ ఉండాల్సిందే. లేకపోతే యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

Follow Us
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం
రేపటితో ముగుస్తున్న Polycet 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. లింక్ ఇదే
రేపటితో ముగుస్తున్న Polycet 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. లింక్ ఇదే
సమ్మర్‌లో రోజూ కొబ్బరి నీళ్లు తాగితే.. మీ శరీరంలో కనిపించే మార్పు
సమ్మర్‌లో రోజూ కొబ్బరి నీళ్లు తాగితే.. మీ శరీరంలో కనిపించే మార్పు
AC నుంచి వాటర్‌ లీక్‌ అవుతుందా? ఇలా చేయండి!
AC నుంచి వాటర్‌ లీక్‌ అవుతుందా? ఇలా చేయండి!