EPFO: పాత PF ఖాతాలో డబ్బులు నిలిచిపోయాయా? ఈపీఎఫ్ఓ కొత్త పోర్టల్‌తో సులభంగా విత్‌డ్రా!
EPFO: దాదాపు 30.91 లక్షల నిష్క్రియాత్మక ఈపీఎఫ్ ఖాతాలు ఉండగా, వీటిలో దాదాపు రూ. 9,330 కోట్ల డబ్బు జమ అయింది. ఈ డేటా 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. ఈ కొత్త పోర్టల్ అటువంటి ఖాతాలను గుర్తించడంలో సహాయపడుతుంది. అలాగే..

EPFO: మీ పాత EPF ఖాతా నిష్క్రియంగా ఉందా? చింతించకండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మీ జీవితాన్ని సులభతరం చేసింది. మీరు ఇప్పుడు కొత్త ఈపీఎఫ్‌వో పోర్టల్ ద్వారా మీ పాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. డిపాజిట్లను బదిలీ చేసుకోవచ్చు. జూలై 27న లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.
ఈ సమస్య ఎందుకు తలెత్తుతుంది?
చాలా మంది జీతభత్యాలు పొందే ఉద్యోగులు తమ కెరీర్‌లో పలుమార్లు ఉద్యోగాలు మారుతుంటారు. యజమానులు మారినప్పుడు, కొంతమంది ఉద్యోగులు తమ పాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాల రికార్డులను మర్చిపోతారు లేదా పోగొట్టుకుంటారు. ఇలాంటి అనేక సందర్భాల్లో ఈ ఖాతాలలో జమ అయిన నిధులు ఉద్యోగి ప్రస్తుత పీఎఫ్ ఖాతాకు బదిలీ కాకపోవడం వల్ల నిలిచిపోతుంది.
ఒకటి కంటే ఎక్కువ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉన్న EPFO సభ్యులలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గర్తించారు. ఈ విషయాన్ని పార్లమెంటులో ఎంపీ వి.కె. శ్రీకందన్ లేవనెత్తగా, దానికి ప్రతిస్పందనగా కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే కొత్త పోర్టల్ గురించి సమాచారం అందించారు.
కొత్త ఈపీఎఫ్‌వో పోర్టల్ ద్వారా త్వరితగతిన పనులు:
పైన పేర్కొన్న కారణాల వల్ల పాత లేదా నిష్క్రియంగా ఉన్న పీఎఫ్ ఖాతాలు మూసివేసిన ఉద్యోగులు ఇప్పుడు కొత్త ఈపీఎఫ్‌వో డిజిటల్ పోర్టల్ ద్వారా తమ పీఎఫ్ డిపాజిట్లను ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే దానిని మరొక ఖాతాకు బదిలీ కూడా చేసుకోవచ్చు. ఈ కొత్త ఆధార్ ఆధారిత ప్లాట్‌ఫారమ్ ద్వారా అర్హులైన సభ్యులు నిష్క్రియ ఖాతాలను గుర్తించడం, వాటి నిల్వలను తనిఖీ చేయడం, వాటిని వారి యాక్టివ్ UANలకు బదిలీ చేయడం లేదా ఆన్‌లైన్‌లో క్లెయిమ్ దరఖాస్తులను దాఖలు చేయడం వంటివి చేయవచ్చు. ఇది ప్రత్యేకంగా పాత పీఎఫ్ ఖాతాల కోసం రూపొందించారు.
అర్హులైన ఈపీఎఫ్ సభ్యులు తమ పాత పీఎఫ్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి తమ ఆధార్ కార్డును ఉపయోగించి తమ గుర్తింపును ధృవీకరించుకోవచ్చు. ధృవీకరణ తర్వాత వారు తమ అర్హత ఆధారంగా తమ యాక్టివ్ UANలకు డిపాజిట్లను బదిలీ చేసుకోగలుగుతారు.
ఈ పోర్టల్ పనిచేసే విధానం ఇది:
EPFO కొత్త పోర్టల్ ఆధార్ ఆధారిత ధృవీకరణపై పనిచేస్తుంది. దీని ద్వారా ఈపీఎఫ్‌వో సభ్యుల గుర్తింపును డిజిటల్‌గా ధృవీకరించుకోవచ్చు. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం, దీనివల్ల వివిధ యజమానుల వద్ద జమ చేసిన ప్రావిడెంట్ ఫండ్ పొదుపును బదిలీ చేయడంలో జరిగే జాప్యం వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి.
అయితే పాత ఖాతా వివరాలను గుర్తుకు తెచ్చుకోలేని సభ్యులను చేర్చే ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి కరంద్లాజే తన సమాధానంలో స్పష్టం చేశారు. దీని అర్థం అందుబాటులో ఉన్న రికార్డుల నుండి తమ పాత ఈపీఎఫ్ ఖాతాలను స్వయంగా ధృవీకరించుకుని, గుర్తించగలిగే సభ్యులకు మాత్రమే ఈ పోర్టల్ సేవలు అందించగలదు. ఈ కొత్త పోర్టల్ చందాదారులకు అందించే అనేక ప్రయోజనాలను కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాత UANను EPFO మెంబర్ పోర్టల్‌లోని ‘UAN Allotment for Existing PF Account’ ఆప్షన్ ద్వారా యాక్టివ్ EPF ఖాతా కోసం కొత్త UANను కూడా పొందవచ్చు.
ఆర్టీఐ డేటా ప్రకారం, దాదాపు 30.91 లక్షల నిష్క్రియాత్మక ఈపీఎఫ్ ఖాతాలు ఉండగా, వీటిలో దాదాపు రూ. 9,330 కోట్ల డబ్బు జమ అయింది. ఈ డేటా 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. ఈ కొత్త పోర్టల్ అటువంటి ఖాతాలను గుర్తించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: UPI New Rule: మారనున్న UPI చెల్లింపు విధానం.. భారీ ప్లాన్‌కు సిద్ధమవుతున్న ఆర్బీఐ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
