AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu: ఏడో తరగతిలోనే ఒకరు అలా ప్రవర్తించారు.. లైంగిక వేధింపులపై బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్

సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ పై మరో నటి ఓపెన్ అయ్యింది. పలు సీరియల్స్ తో పాటు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను అందరితో పంచుకుంది.

Bigg Boss Telugu: ఏడో తరగతిలోనే ఒకరు అలా ప్రవర్తించారు.. లైంగిక వేధింపులపై బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్
Bigg Boss Telugu Actress
Basha Shek
|

Updated on: Mar 20, 2026 | 4:30 PM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీ సత్య ఒకరు. అంతకు ముందు పలు సీరియల్స్ లో నటించిన ఆమె బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. తన క్యూట్ లుక్స్, మాటలతో బిగ్ బాస్ ఆడియెన్స్ ను కట్టి పడేసింది. కప్పు కొట్టకపోయినా తన మాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పలు టీవీ షోస్ తో సందడి చేస్తోంది. అలాగే మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియోస్ కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీ సత్య జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఒక టాక్ షోకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంది. అలాగే చిన్నతనంలోనూ, సినిమా ఇండస్ట్రీలోని తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, చేదు అనుభవాలు, అవమానాలను షేర్ చేసుకుంది.

చాలా మంది అమ్మయిల్లాగే సినిమా ఇండస్ట్రీలో నేను కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను.ఇప్పటికీ కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అయితే ఎవరు కూడా ఈ విషయం గురించి నేరుగా అడగకుండా పరోక్షంగా అడుగుతుంటారు. నేను సినిమా అవకాశాల కోసం ఆడిషన్ చేసి ఫోటోషూట్లు చేసిన తర్వాత కూడా నన్ను సినిమాల నుంచి తప్పించారు. ఇక కొన్ని షోలలో మేకప్ రూమ్ లో వెళ్లి మేకప్ వేసుకుంటున్నప్పుడు కూడా నా బ్యాగ్ తీసి బయటకు పడేసి ఎవరితో పడితే వాళ్లతో ఎందుకు షేర్ చేసుకుంటాం అంటూ అవమానించారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిల వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నారు మరి చిన్న పిల్ల ఎలాంటి డ్రెస్ వేసుకుంటుంది? వారు ఎందుకు లైంగిక వేధింపుల బారిన పడుతున్నారు? నేను కూడా చిన్నప్పుడు చాలా ఇబ్బందుల పడ్డాను. నేను ఏడో తరగతిలో చదువుతున్నప్పుడు రోడ్డుమీద వెళ్తుంటే నడుము గిల్లి వెళ్లిపోయారు. అక్కడ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి ఆపలేకపోయారు’ అంటూ తనకు జరిగిన చేదు అనుభవాలను బయట పెట్టింది శ్రీ సత్య. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

షాపింగ్ మాల్ లో శ్రీ సత్య..

View this post on Instagram

A post shared by Sri Satya (@sri_satya_)

View this post on Instagram

A post shared by Sri Satya (@sri_satya_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us