Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్.. మరీ దారుణంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఇరాన్ ఉద్రిక్తతల మధ్య బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పడిపోయాయి. సాధారణంగా యుద్ధ వాతావరణంలో పెరగాల్సిన విలువైన లోహాల ధరలు, దీనికి విరుద్ధంగా $2 ట్రిలియన్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. భారత్‌లోనూ మార్చి 24న 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940, కిలో వెండి ధర రూ.10,000 తగ్గింది. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి.
ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా యుద్ధం లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు బంగారం, వెండి ధరలు రక్షణ కవచంలా పెరగాలి. అయితే దీనికి విరుద్ధంగా జరుగుతోంది. ఇరాన్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో విలువైన లోహాల ధరలు భారీగా పడిపోవడం ఒక అసాధారణ పరిణామంగా మారింది. ప్రముఖ మార్కెట్ విశ్లేషణ వేదిక ది కోబేసీ లెటర్ నివేదిక ప్రకారం.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే బంగారం, వెండి మార్కెట్ విలువ దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. కాగా భారత్‌లో మార్చి 24 మంగళవారం కూడా బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,940 తగ్గి రూ.1,40,350 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,700లు తగ్గి రూ.1,28,650లు పలుకుతోంది. కిలో వెండిపై రూ.10,000 తగ్గి, రూ.2,40,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం బంగారం, వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,500 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,28,800 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,40,350 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,28,650 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,820 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,30,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,350 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,650 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,40,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రంలో ఇంటర్నెట్ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..

