సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
తెలంగాణ ఇంటర్ విద్యార్థి పరీక్ష జవాబు పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రశ్నలకు బదులు, విద్యార్థి గురువును పాస్ చేయమని వేడుకుంటూ ఒక బొమ్మ గీసి, భావోద్వేగ సందేశం రాశాడు. "నాకు తల్లిదండ్రులు లేరు, మీరే నా దేవుడు, దయచేసి నన్ను పాస్ చేయండి" అని అభ్యర్థించాడు. ఈ ఘటన నెటిజన్ల దృష్టిని ఆకర్షించి, పరీక్షల భయం, విద్యార్థుల ఒత్తిడిపై చర్చకు దారితీసింది.
పరీక్షలంటే కొందరు విద్యార్ధులకు చాలా భయంగా ఉంటుంది. ఎంత బాగా చదివినా పరీక్ష హాల్‌లోకి వెళ్లాక పరీక్ష సరిగా రాయలేకపోతారు. దీంతో కొందరు పేపరు ఖాళీగా వదిలేస్తారు, మరికొందరు సినిమా పాటలు రాస్తారు. కానీ, తెలంగాణకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి మాత్రం తన పాస్ మార్కుల కోసం ఏకంగా ఎగ్జామినర్ మనసు కరిగించేలా తన ‘క్రియేటివిటీ’ని ప్రదర్శించాడు. ప్రస్తుతం ఈ విద్యార్థి రాసిన ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసి, ప్రస్తుతం మూల్యాంకనం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ విద్యార్థి రాసిన జవాబు పత్రం చూసి ఎగ్జామినర్ అవాక్కయ్యారు. ఆ విద్యార్థి ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా.. ఓ గురువు కాళ్లపై శిష్యుడు పడి నమస్కరిస్తున్నట్లుగా ఒక బొమ్మ గీశాడు. ఆ బొమ్మలో గురువును ‘సార్’ అని, తనను ‘నేను’ అని నామకరణం చేసి, “సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి” అంటూ దీనంగా వేడుకున్నాడు. “సార్.. నాకు అమ్మానాన్న లేరు. గురువులే నాకు తల్లిదండ్రులు. నేను దేవుడిని నమ్ముతున్నాను.. ఆ దేవుడు కూడా మీరే సార్. నేను ఎంతో కష్టపడి చదివిన ప్రశ్నలేవీ పరీక్షలో రాలేదు. దయచేసి ఈ ఒక్కసారికి నన్ను పాస్ చేయండి.. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. ప్లీజ్ సార్!” అంటూ రాసుకొచ్చాడు. ఈ ఆన్సర్ షీట్‌ను చూసిన ఎగ్జామినర్ దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “పాపం ఆ అబ్బాయి పరిస్థితి చూడండి” అని కొందరు అంటుంటే, ఇలాంటి వింతలు ప్రతీ ఏడాది కామనే కదా! అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గుతున్న బంగారం ధర
Rashmika Mandanna: చలాకీగా సందడి చేస్తున్న రష్మిక మందన్న
Dhurandhar 2: బెస్ట్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్2
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..

