AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!

సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!

Phani CH
|

Updated on: Mar 24, 2026 | 4:04 PM

Share

సముద్రగర్భ కేబుల్స్ ప్రపంచ ఇంటర్నెట్‌కు ఆధారం. పశ్చిమాసియా యుద్ధాలు ఈ కేబుల్స్‌కు తీవ్ర ముప్పుగా మారాయి. డేటా ప్రవాహంలో అంతరాయాలు, ఇంటర్నెట్ వేగం తగ్గడం వల్ల ఆర్థిక లావాదేవీలు, క్లౌడ్ సేవలు ప్రభావితమవుతాయి. ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధి కీలక డిజిటల్ కారిడార్లుగా మారాయి. యుద్ధం ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై నిశ్శబ్దంగా ఒత్తిడి పెంచుతోంది.

సమాచార విప్లవానికి కారణమై… ప్రపంచం కుగ్రామంగా మారటానికి మూలం ఇంటర్నెట్‌! ఇంటర్నెట్‌ సక్రమంగా పని చేస్తోందంటే సముద్ర గర్భంలో వేసిన కేబుల్‌ లైన్లు కారణం. అన్ని సముద్రాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 9 లక్షల మైళ్ల ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్ల ద్వారానే ప్రపంచంలోని 95% డాటా అనుక్షణం ప్రసారమవుతుంటుంది. ఇప్పుడా కేబుల్‌ వ్యవస్థలే హోర్ముజ్ జలసంధిలో మంటలు రేకెత్తించాయి. పశ్చిమాసియాలో రాజుకుంటున్న యుద్ధం కేవలం గగనతలం, భూభాగాలకే పరిమితం కావడం లేదు. ప్రపంచ డిజిటల్ వ్యవస్థకు వెన్నెముకలాంటి సముద్రగర్భ డేటా కేబుళ్లపైనా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తాజా నిదర్శనంగా, మెటా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘2 ఆఫ్రికా’ కేబుల్ ప్రాజెక్టు పనులు పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్ట్‌లో కేబుల్ వేసే నౌక సౌదీ అరేబియా సమీపంలో చిక్కుకుపోయింది. ఈ పరిణామానికి యుద్ధం కారణమని స్పష్టమైంది. ప్రపంచంలో ఎర్ర సముద్రం, హ‌ర్మూజ్ జలసంధి డిజిటల్ కమ్యూనికేషన్లకు ముఖ్యం. యూరోప్‌, ఆసియా, ఆఫ్రికాలను కలిపే ఎర్ర సముద్రం ఇప్పటికే ముఖ్యమైన సబ్‌సీ డేటా కారిడార్‌గా ఉంది. గతంలో ఇక్కడ కేబుళ్లు దెబ్బతినడంతో భారత్, పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ వేగం తగ్గి, సేవలకు అంతరాయం కలిగింది. ఇప్పుడు హ‌ర్మూజ్ జలసంధి గల్ఫ్ దేశాలలోని డేటా సెంటర్లను అంతర్జాతీయ నెట్‌వర్క్‌లతో అనుసంధానించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అందుకే హ‌ర్మూజ్‌ను ఇప్పుడు చమురు మార్గంగానే కాకుండా కమ్యూనికేషన్స్ చెక్‌పాయింట్‌గానూ చూస్తున్నారు. సముద్ర గర్భంలోని కేబుళ్లు 95 శాతం పైగా అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను, రోజూ సుమారు 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లావాదేవీలను మోసుకెళ‌తాయి. వీటిని లక్ష్యంగా చేసుకోవడం సులభం కాకపోయినా… నౌకల లంగర్లు, ప్రమాదాలు, సైనిక కార్యకలాపాల వల్ల కేబుళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే, ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఇంటర్నెట్ మొత్తం ఆగిపోతుందన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఒక మార్గం దెబ్బతింటే నెట్‌వర్క్‌లు ప్రత్యామ్నాయ మార్గాల్లో డేటాను మళ్లిస్తాయి. కానీ, అసలైన ముప్పు ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోవడం కాదు, వేగం తగ్గడం, డేటా ప్రవాహానికి తీవ్ర అంతరాయాలు కలగడం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ నెట్‌వర్క్‌లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. క్షిపణుల దాడులే వార్తల్లో నిలుస్తున్నాయి. కానీ సముద్ర గర్భంలో ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై ఒత్తిడి నిశ్శబ్దంగా పెరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..

సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి

Follow Us