AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: తెలంగాణలో వీరికి రైతు భరోసా కట్.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్.. ఈ పనిచేస్తేనే అకౌంట్లోకి..

రైతు భరోసా జమకాని రైతులకు రేవంత్ ప్రభుత్వం అలర్ట్ జారీ చేశారు. బ్యాంక్ ఖాతాల్లో సాంకేతిక సమస్య వల్ల కొంతమంది రైతులకు రైతు భరోసా జమ కాలేదు. దీంతో సమస్యను పరిష్కరించుకోవాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మంత్రి తుమ్మల ప్రకటన చేశారు.

Rythu Bharosa: తెలంగాణలో వీరికి రైతు భరోసా కట్.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్.. ఈ పనిచేస్తేనే అకౌంట్లోకి..
Rythu Bharosa
Venkatrao Lella
|

Updated on: Mar 24, 2026 | 4:02 PM

Share

రైతు భరోసా లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన సిద్దిపేటలోని నర్మెట్టలో జరిగిన బహిరంగ సభలో రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. 68.89 లక్షల మంది రైతులకు రూ.3,446 కోట్లు జమ చేశారు. లబ్దిదారులందరికీ తొలి ఎకరానికి రూ.6 వేలు విడుదల చేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు రోజు రావడంతో.. సోమవారం ఇవి రైతులకు జమ అయ్యాయి. అయితే కొంతమంది రైతులకు సొమ్ము పడటకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరికి అలర్ట్ జారీ చేశారు.

బ్యాంక్ అకౌంట్ల రెన్యూవల్

రైతు భరోసా డబ్బులు పడనివారు తమ బ్యాంక్ అకౌంట్లను రెన్యూవల్ చేసుకోవాలని మంత్రి తుమ్మల తెలిపారు. బ్యాంకులకు వెళ్లి ఈ పని చేయించుకుంటే వెంటనే సొమ్ము అందుతుందని సూచించారు. కొంతమంది రైతులు తమ అకౌంట్లను రెన్యూవల్ చేసుకోలేదని, వీరికి నిధులను అధికారులు నిలిపివేసినట్లు తెలిపారు. బ్లాక్ అయిన అకౌంట్లను రైతులు వెంటనే రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. బ్యాంకులు ముందుగానే రైతులకు సమాచారం అందించాలని, బ్యాంకులు ఇన్పర్మేషన్ ఇవ్వకపోవడంపై తుమ్మల ఫైర్ అయ్యారు. వారి బ్యాంక్ ఖాతాలను వెంటనే పునరుద్దరించి పెట్టుబడి సాయం జమ చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. రైతులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిధులు ఆపేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రైతుల నిధులకు బ్రేక్

రాష్ట్రంలో దాదాపు 4,405 మంది రైతులకు అందాల్సిన రూ.2,18,96,556 సాయానికి బ్రేక్ పడింది. రైతు భరోసా అందకపోవడంతో రైతులు వెళ్లి వ్యవసాయ అధికారులను సంప్రదించారు. దీంతో బ్యాంక్ అకౌంట్లు రెన్యూవల్ చేసుకోకపోవడం వల్లనే నిధులు జమ కాలేదని చెప్పారు. దీంతో తుమ్మల స్పందించి.. ఈ రైతులకు వెంటనే సాయం జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకులు ముందుగానే రైతులకు సమాచారం అందించి రెన్యూవల్ చేయించుకోనేలా చేయాలని సూచించారు. కాగా యాసంగి సీజన్‌కు సంబంధించి తొలి విడత నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. మొత్తం మూడు విడతలుగా వీటిని అందించాలని నిర్ణయించింది. తొలి విడతలో ఎకరం భూమికి అందించగా.. రెండో విడతలో మూడు ఎకరాలకు ఇవ్వనుంది. ఇక చివరి విడతలో అన్ని ఎకరాలకు జమ చేయనుది. మొత్తం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు.

Follow Us
తెలంగాణలో వీరికి రైతు భరోసా కట్.. ప్రభుత్వం నుంచి బిగ్ న్యూస్
తెలంగాణలో వీరికి రైతు భరోసా కట్.. ప్రభుత్వం నుంచి బిగ్ న్యూస్
ఒవైసీ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..?
ఒవైసీ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..?
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
రోజా కూతురు ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? అన్షు లేటెస్ట్ ఫొటోస్
రోజా కూతురు ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? అన్షు లేటెస్ట్ ఫొటోస్
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
పొరపాటన కూడా ఛాట్‌జీపీటిలో ఇవి ఎంటర్ చేయకండి
పొరపాటన కూడా ఛాట్‌జీపీటిలో ఇవి ఎంటర్ చేయకండి
గోంగూర చికెన్ కర్రీ.. ఈ సీక్రెట్ తెలిస్తే గిన్నె ఊడ్చాల్సిందే
గోంగూర చికెన్ కర్రీ.. ఈ సీక్రెట్ తెలిస్తే గిన్నె ఊడ్చాల్సిందే
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..