AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ సింగరేణిలో గవర్నమెంట్ జాబ్‌ వదిలేసి మరీ జబర్దస్త్‌లోకి.. ఇప్పుడేమో..

జబర్దస్త్ కామెడీషో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఇక్కడ కమెడియన్లుగా చేసిన ఎంతో మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా బిజీ బిజీగా ఉంటున్నారు. అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ కమెడియన్ కూడా ఉన్నాడు.

Jabardasth: యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ సింగరేణిలో గవర్నమెంట్ జాబ్‌ వదిలేసి మరీ జబర్దస్త్‌లోకి.. ఇప్పుడేమో..
Jabardasth Comedian
Basha Shek
|

Updated on: May 14, 2026 | 6:39 PM

Share

జబర్దస్త్ కామెడీ షో కంటెంట్ పై విమర్శలున్నాయి. కానీ ఇప్పటికీ చాలా మందికి ఇది ఫేవరెట్ షో. విమర్శల సంగతి పక్కన పెడితే.. ఈ కామెడీ షో చాలా మందికి జీవితాన్ని ఇచ్చింది. ఎంతో మంది ట్యాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. జబర్దస్త్ లో చేసిన సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా, నిర్మాతలుగా, డైరెక్టర్లుగా బిజీ బిజీగా ఉంటున్నారు. అందులో ఈ జబర్దస్త్ కమెడియన్ కూడా ఒకడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతను కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. సింగరేణి సంస్థతో పాటు పలు డిపార్టమెంట్స్ లో ప్రభుత్వ ఉద్యోగిగా చేశాడు. కానీ తనకంటూ ఓ గుర్తింపు ఉండాలనే తలంపుతో అన్నిటినీ వదులుకున్నాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి జబర్తస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కామెడీతో ఏకంగా టీమ్ లీడర్ గా ఎదిగిపోయాడు. ఇప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. అతను మరెవరో కాదు బొజ్జపల్లి వెంకీ అలియాస్ వెంకీ మంకీ.

మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు వెంకీ. ఎన్నో ఈవెంట్లలో తన మిమిక్రీ ట్యాలెంట్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక సాధారణ కంటెస్టెంటుగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతి తక్కువ టైమ్ లోనే టీమ్ లీడర్ వరకూ ఎదిగాడు వెంకీ. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాటు సినిమాల్లోనూ మెరుస్తోన్న వెంకీ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

షూటింగ్ లో వెంకీ  మంకీ..

‘నేను కాకతీయ యూనివర్సిటీ నుంచి డిప్లమా ఇన్ మిమిక్రీ లో గోల్డ్ మెడల్ అందుకున్నాను. తర్వాత వీడియో జాకీగా చేశాను. సింగరేణి తో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంటే అంత సులభమైన విషయమేమీ కాదు. కానీ నేను వాటిని కూడా వదులుకున్నాను. నాకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని నాకు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలను వదిలేశాను. మన గురించి తెలియవలసింది మన ఊర్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా నా గురించి తెలియజేయాలని అనుకున్నాను. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇది సాధ్యమైంది’ అని చెప్పుకొచ్చాడు జబర్దస్త్ వెంకీ.

ఫ్యామిలీతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us