AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: సుడిగాలి సుధీర్ కాదు, హైపర్ ఆది కాదు.. జబర్దస్త్‌లో 10 లక్షలు తీసుకున్న ఫస్ట్ కమెడియన్ ఎవరో తెలుసా?

జబర్ధస్త్ కామెడీ షో ఎంతో మంది ట్యాలెంటెట్ ఆర్టిస్టులను ప్రపంచానికి పరిచయం చేసింది.ఈ షోలో చేసిన వారిలో చాలా మంది ఇప్పుడు ఇప్పుడు స్టార్లుగా మారారు. హీరోలు గా, డైరెక్టర్లుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్నారు.

Jabardasth: సుడిగాలి సుధీర్ కాదు, హైపర్ ఆది కాదు..  జబర్దస్త్‌లో 10 లక్షలు తీసుకున్న ఫస్ట్ కమెడియన్ ఎవరో తెలుసా?
Jabardasth
Basha Shek
|

Updated on: Jul 15, 2026 | 7:49 PM

Share

2013లో ప్రారంభమైంది జబర్దస్త్ కామెడీ షో. కంటెంట్ పరంగా ఈ షోపై కొన్ని విమర్శలున్నా దీని ద్వారానే ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ.. ఇలా ఎంతో మంది ఆర్టిస్టులు ఈ జబర్దస్త్ షోతోనే అందరికీ పరిచయం అయ్యారు. కంటెస్టెంట్స్, టీమ్ లీడర్లుగా పనిచేసి బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు వీరిలో చాలా మంది సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా రాణిస్తున్నారు. అంతేకాదు జబర్దస్త్ లో చేసిన వారందరూ ఇప్పుడు లగ్జరీ లైఫ్ ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. బంగ్లాలు కొనేస్తున్నారు. కార్లలో తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే 13 ఏళ్ల జబర్దస్త్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న కమెడియన్ ఎవరో తెలుసా? చాలా మంది సుడిగాలి సుధీర్ లేదా హైపర్ ఆది అనుకుంటారు. కానీ వీరిద్దరూ కాదు..

జబర్దస్త్ చరిత్రలో ఎక్కువ రెమ్యునరేన్ అందుకున్న స్టార్ కమెడియన్ చమ్మక్ చంద్రనే. ఈ విషయాన్ని జబర్దస్త్ మాజీ కమెడియన్ రామునే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ‘జబర్దస్త్ షో ప్రారంభ దశలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నది కమెడియన్ చమ్మక్ చంద్ర నే. ఒక్కో ఎపిసోడ్‌కు అతను కనీసం రూ.2 లక్షల వరకు పారితోషికం తీసుకున్నాడు’ అని రాము చెప్పుకొచ్చాడు. దీని ప్రకారం చమ్మక్ చంద్ర నెలకు సుమారు 10 లక్షల వరకు ఆదాయం పొందేవాడు.

ఇవి కూడా చదవండి

చమ్మక్ చంద్ర లేటెస్ట్ ఫొటోస్..

కాగా చమ్మక్ చంద్ర తరువాతే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వారు కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ కు చేరుకోగలిగారని రాము తెలిపాడు. జబర్దస్త్ మానేసే టైమ్ కు సుధీర్ కూడా ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నాడట. ఇక సుదీర్, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది తదితరులు ఇప్పుడు జబర్దస్త్ కు దూరమయ్యారు. వీరంతా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

సినిమా ఈవెంట్ లో చమ్మక్ చంద్ర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us