AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోయిన్ గజాల‏తో నిజంగానే గొడవ.. అసలు విషయం చెప్పిన ఆనందం హీరోయిన్..

హీరోయిన్ రేఖ వేదవ్యాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సినిమాలకు దూరమైన రేఖ.. ఆ తర్వాత కొన్నాళ్లకు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కొన్ని రోజులు అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆమె ఇప్పుడు తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో రేఖ మాట్లాడుతూ.. ఓ హీరోయిన్ తో గొడవలంటూ వస్తున్న వార్తలపై స్పందించారు.

Tollywood : హీరోయిన్ గజాల‏తో నిజంగానే గొడవ.. అసలు విషయం చెప్పిన ఆనందం హీరోయిన్..
Rekha
Rajitha Chanti
|

Updated on: Jul 15, 2026 | 6:42 PM

Share

ఆనందం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ రేఖ వేదవ్యాస్. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేఖ.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రధానంగా, ఆమె తోటి నటి గజాలతో విభేదాలు ఉన్నాయని బయటకొచ్చిన వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ “ఫేక్ న్యూస్” అని, “మార్కెటింగ్ జిమ్మిక్” కావచ్చని స్పష్టం చేశారు. “రియాలిటీ ఆ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. గజాల గారికి మీకు ఏదో ప్రాబ్లం అయిందని గొడవ అయిందని చాలా ఫేక్ న్యూస్‌లు బయటికి వచ్చాయని నేను ఫీల్ అనుకుంటున్నా” అని హోస్ట్ అడగ్గా.. రేఖ మాట్లాడుతూ.. ” నేను ఫస్ట్ టైం వింటున్నాను. నిజంగా అలా అనుకున్నారు మన వాళ్ళు. ఏం లేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు. నాకు ఎవరితో గొడవ పెట్టుకోవడం నచ్చదు. నాకు ఇగో లేదు” అని అన్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలు ఎలా పుట్టాయో తెలియదని, ప్రజలు ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నారు అని వార్తలు పెడితే ఆసక్తి చూపిస్తారని, అందుకే ఇలాంటివి సృష్టిస్తున్నారని ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించారు. తనకు ఎవరితో ఎటువంటి సమస్యలూ లేవని ఆమె తేల్చి చెప్పారు.

ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని రేఖ స్పష్టం చేశారు. “మరి మీ పెళ్లి కోసమే మేము ఎప్పుడు ఎదురుచూడాలి?” అని అడిగిన ప్రశ్నకు, “మన ఇండియాలో ఒక సల్మాన్ ఖాన్ గారు, నేను ఇద్దరం మిగిలిపోతామేమో సింగిల్ గా” అని సరదాగా సమాధానమిచ్చారు. “దొరకట్లేదు ఎవరూ మంచి అబ్బాయి. నేనేం చేయాలి?” అని ప్రశ్నించారు. తాను సింగిల్‌గా ఉన్నానంటే ఎవరూ నమ్మడం లేదని, ఎవరో ఉంటారులే అని అనుకుంటున్నారని ఆమె అన్నారు.

తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ.. “అంత పెద్ద ప్లానింగ్ ఏం లేదు. అదంతా ఒక టైంలో ఉంటుంది. వెన్ యూ నో వెన్ యు ఆర్ లైక్ రియల్లీ యంగ్. ఓ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక వంద పాయింట్స్ ఉంటది లిస్ట్ లో. ఇప్పుడు అదంతా ఏం లేదు” అని ఆమె వివరించారు. “హి హాస్ టు బీ ఎ జెన్యూన్లీ… పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరూ కాదు, నేను కాదు. గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ లవ్స్ మీ” అని స్పష్టం చేశారు. ఎత్తు, రంగు వంటి విషయాల కంటే వ్యక్తిత్వం ముఖ్యమని ఆమె చెప్పారు. అయితే, ఎత్తు గురించి మాట్లాడుతూ, “నాకంటే హైట్ ఎక్కువ ఉండాలి కదా. మరి అమ్మాయి హైట్? మీ హైట్ ఎంత మ్యామ్? నేను ఫైవ్ సిక్స్ ఏమో మోస్ట్లీ. ఫైవ్ సెవెన్ ఉన్నారేమో” అని తన ఎత్తు ఐదు అడుగుల ఆరు అంగుళాలు అని చెప్పారు. “ఏమండీ అని పిలవలేము కదా” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us