AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు

కేరళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 15న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ బాగానే ఆడింది. ఐఎమ్ డీబీలోనూ ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కు టాప్ రేటింగ్ ఉండడం విశేషం.

OTT Movie:  యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఓటీటీలోకి  మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 15, 2026 | 6:16 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. సమంత మా ఇంటి బంగారం, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు వంటి తెలుగు సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటితో పాటు ఓ మలయాళం పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ దాదాపు మూడు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. 2018 సినిమాతో తెలుగు వారికి బాగా చేరువైన టొవినో థామస్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పల్లిచట్టంబి’. లేటెస్ట్ సెన్సేషన్ కాయదు లోహర్ మలయాళంలో నటించిన మొదటి సినిమా ఇది. 1957లో కేరళలో జరిగిన భూసంస్కరణ బిల్లు నేపథ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ సొంతం చేసుకుంది. వచ్చే శుక్రవారం (జులై 24) నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది సోలీ లివ్. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ పళ్లీ చట్టంబి సినిమా స్ట్రీమింగ్ కానుంది.

కాగా థియేటర్లలో రిలీజైన మూడు నెలలకు ఈ సినిమా ఓటీటీలోకి రానుండడం గమనార్హం. ‘జనగణమన’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హీరో, హీరోయిన్లతో పాటు శత్రు, విజయరాఘవన్, సిద్ధిక్, బాబురాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్ ఫిల్మ్స్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన పళ్లి చట్టంబి సినిమా ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

సోనీ లివ్ ఓటీటీలో కాయదు లోహర్ మొదటి మలయాళం సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్ "రైలు పలహారం"
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!
ఒక్క నిర్ణయంతో ఆ దేశంలో పొగరాయుళ్ల ఆటకట్టించిన సర్కార్..
ఒక్క నిర్ణయంతో ఆ దేశంలో పొగరాయుళ్ల ఆటకట్టించిన సర్కార్..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు
వీటి ముందు మిల్లెట్స్ కూడా జుజుబీ.. ఇది బంగారంతో సమానం
వీటి ముందు మిల్లెట్స్ కూడా జుజుబీ.. ఇది బంగారంతో సమానం
ముత్యం ధరించాలనుకుంటున్నారా? ఏ రాశులకు శుభం.. ఎవరు ధరించకూడదు?
ముత్యం ధరించాలనుకుంటున్నారా? ఏ రాశులకు శుభం.. ఎవరు ధరించకూడదు?
SIR గడువు తేదీ పొడిగింపు.. ఈసీ ఆదేశాలు జారీ..!
SIR గడువు తేదీ పొడిగింపు.. ఈసీ ఆదేశాలు జారీ..!