AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sunaina: అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. ఆరోజు ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటి కామెంట్స్..

"అమ్మోరు" సినిమా షూటింగ్‌లో ఎదుర్కొన్న సవాళ్లను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నటి సునయన. ఈ మూవీలో ఆమె బాలనటిగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో షూటింగ్ కోసం నిజమైన నాగుపాముతో నటించానని.. ఆరోజు రాత్రంతా తనకు నిద్ర పట్టలేదని వెల్లడించారు. కానీ సినిమా విడుదలయ్యాక లభించిన అద్భుతమైన ఆదరణను వివరించారు. కూచిపూడి నర్తకిగా ఆమె నృత్య ప్రదర్శనలు, అమ్మోరు పాప ఇమేజ్ ఎలా సహాయపడ్డాయో సునయన పంచుకున్నారు.

Actress Sunaina: అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. ఆరోజు ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటి కామెంట్స్..
Sunayana
Rajitha Chanti
|

Updated on: Jul 15, 2026 | 6:25 PM

Share

అమ్మోరు సినిమాతో బాలనటిగా అఖండ కీర్తిని సంపాదించుకున్న నటి సునయన. ఇప్పుడు సహయ నటిగా అలరిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, అమ్మోరు సినిమా షూటింగ్ అనుభవాలు, వ్యక్తిగత జీవిత విశేషాలను వెల్లడించారు. చిన్నతనం నుంచే సీరియళ్లలో నటించడం ప్రారంభించిన సునయన, తాను సినిమాల్లో హీరోయిన్‌గా రాణించలేకపోవడానికి గల కారణాలను వివరించారు. పద్ధతిగల అమ్మాయి ఇమేజ్, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలనే ఆలోచన తన కెరీర్‌ను ప్రభావితం చేశాయని ఆమె తెలిపారు. తన పదవ తరగతి పూర్తవగానే సీరియల్స్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టానని, అప్పట్లో సీరియల్స్‌లో నటించినవారు సినిమాల్లో విజయం సాధించడం కష్టమని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు 20వ దశకంలో వెస్ట్రన్ లుక్స్ అంతగా సరిపోవని, 30 ఏళ్లు దాటిన తర్వాత అలాంటి పాత్రలు అసలు చేయలేనని ఆమె స్పష్టం చేశారు. అమ్మోరు సినిమాలో చిన్న వయసులోనే (ఏడు, ఎనిమిదేళ్లు) ఒక దేవతా రూపంలో కనిపించడం ఒక గొప్ప సవాల్ అని సునయన తెలిపారు. ఈ సినిమా తన నాలుగో తరగతి చదువుతున్నప్పుడు విడుదలైంది. ముఖ్యంగా, దర్శకుడు కోడి రామకృష్ణ గారు సన్నివేశాలను వాస్తవికంగా చిత్రీకరించడానికి ఎంతో కృషి చేశారని ఆమె అన్నారు.

అమ్మోరు సినిమా షూటింగ్‌లో ఆమెకు ఎదురైన అత్యంత భయంకరమైన అనుభవం ఒక నిజమైన నాగుపాముతో నటించడం. ఒక సన్నివేశంలో సౌందర్య గారి చేతిలోంచి ఒక నాగుపామును తీసుకొని పట్టుకోవాలని తనను కోరారని సునయన వెల్లడించారు. పాము కోరలు తీసేసి, నోరు కుట్టేసినప్పటికీ, అది నిజమైన పాము కావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సన్నివేశం చిత్రీకరణ తనకు ఒక మానసిక క్షోభను మిగిల్చిందని, ఇప్పటికీ ఆ ట్రామా వెంటాడుతుందని ఆమె అన్నారు. అయినప్పటికీ, తన తల్లి ప్రోత్సాహంతో, ఎంతో ధైర్యం చేసి ఆ సన్నివేశంలో నటించానని, అయితే ఆ సన్నివేశాన్ని చివరకు సినిమాలో తొలగించారని సునయన తెలిపారు.

అమ్మోరు సినిమాలోని డ్యాన్స్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ, తాను కూచిపూడి నర్తకిని అని, అది తనకు ఎంతో సహాయపడిందని చెప్పారు. సంగీతంపై తనకున్న అభిరుచి, నృత్యంలో శిక్షణ తనకు బీట్ వస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా డ్యాన్స్ చేయగలిగే శక్తిని ఇచ్చిందని వివరించారు. అమ్మోరు విడుదలై 1995లో, మొదట్లో పెద్దగా స్పందన లేకపోయినా, తర్వాత కాలంలో అద్భుతమైన విజయం సాధించిందని, ఊరూరా థియేటర్ల ముందు అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి, తనను రథయాత్రలలో తీసుకెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో తనకు లభించిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఈ సినిమా తన తల్లికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఆమె తనను తన బొమ్మలా చూసుకున్నారని సునయన భావోద్వేగంగా పంచుకున్నారు. అమ్మోరులో నీలి రంగు మేకప్ వేయడం వల్ల చర్మ సమస్యలు కూడా వచ్చాయని ఆమె తెలిపారు. ఇప్పటికీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మవారి మహిమ తనను కాపాడుతుందని ఆమె నమ్ముతారు.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us
అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. తర్వాత జరిగిందిదే..
అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. తర్వాత జరిగిందిదే..
ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి
ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్ "రైలు పలహారం"
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!
ఒక్క నిర్ణయంతో ఆ దేశంలో పొగరాయుళ్ల ఆటకట్టించిన సర్కార్..
ఒక్క నిర్ణయంతో ఆ దేశంలో పొగరాయుళ్ల ఆటకట్టించిన సర్కార్..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు
వీటి ముందు మిల్లెట్స్ కూడా జుజుబీ.. ఇది బంగారంతో సమానం
వీటి ముందు మిల్లెట్స్ కూడా జుజుబీ.. ఇది బంగారంతో సమానం