చేసిన మూడు సినిమాలు ఫ్లాప్.. హిట్ కోసం అమ్మడి ఎదురుచూపులు 

15 July  2026

Pic credit - Instagram

Rajeev 

సిమ్రాన్ చౌదరి.. అందం అభినయం ఉన్న ఆ అవకాశాలు అందుకోలేకపోతుంది ఈ వయ్యారి భామ. 

సిమ్రాన్‌ చౌదరి తన 12 ఏళ్ళ వయసులో కమర్షియల్‌ యాడ్స్‌ లో నటించి, తరువాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

ఆమె 2012 లో మిస్ ఆంధ్రప్రదేశ్ గా, టాలీవుడ్ మిస్ హైదరాబాద్ గా , 2017 లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ అవార్డులను గెలుచుకుంది. 

2014లో వచ్చిన హమ్ తుమ్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా హిట్ అయినా.. సిమ్రాన్ కు అంత క్రేజ్ రాలేదు. 

ఆ తర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి హిట్ అందుకుంది. దాంతో ఈ చిన్నదాని క్రేజ్ పెరిగిపోయింది. 

వరుసగా బొంభాట్, చెక్,  పాగల్, సెహరి, అథర్వ, లవ్ మీ, రీసెంట్ గా వనవీర సినిమాలో నటించింది. 

కానీ ఈ బ్యూటీకి సరైన గుర్తింపు రావడం లేదు. సాలిడ్ హిట్ పడితే హీరోయిన్ గా రాణించాలని ఎదురుచూస్తుంది.