Dhanush’s Sir: రిలీజ్‌కు ముందే ధనుష్ ‘సార్’ జోష్.. అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్‌ఫుల్.. ఆ దేశంలో కూడా..

రేపు అంటే ఫిబ్రవరి 17న రిలీజ్ అవనున్న ‘సార్’ విడుదల కాక ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ము లేపుతోంది. ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ సినిమా విషయానికి వస్తే.. దక్షిణాదిలో..

Dhanush's Sir: రిలీజ్‌కు ముందే ధనుష్ ‘సార్’ జోష్.. అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్‌ఫుల్.. ఆ దేశంలో కూడా..
Dhanush's Sir
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2023 | 3:35 PM

3, రఘువరన్ బీటెక్ వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సౌత్ సూపర్ స్టార్ ధనుష్, యువ హీరోయిన్ సంయుక్త జంటగా తెరకెక్కిన చిత్రం ‘సార్’(తమిళంలో వాతి). వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా..  మూవీ టీజర్లు, ట్రైలర్లు క్రియేట్ చేసిన బజ్‌తో దూసుకొస్తోంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం రిలీజ్‌కు ఒకరోజు ముందే సార్ ప్రీమియర్లు మొదలయ్యాయి. ఇక రేపు అంటే ఫిబ్రవరి 17న రిలీజ్ అవనున్న ‘సార్’ విడుదల కాక ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ము లేపుతోంది. సార్(తమిళంలో వాతి) సినిమా విషయానికి వస్తే.. దక్షిణాదిలో ముఖ్యంగా హైదరాబాద్, చెన్నైలో ప్రీమియర్లను ప్రదర్శించాలని నిర్మాత షాకింగ్ నిర్ణయం తీసుకొన్నారు. సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకం, ధనుష్ యాక్టింగ్, సంయుక్త మీనన్ ఫెర్ఫార్మెన్స్, మ్యూజిక్ తదితర అంశాలు సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయని సమాచారం. అలాగే అమెరికాలో కూడా ఈ సినిమా జోష్ కనబరుస్తుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సినిమా నేపథ్యంలో అదే.. 

సార్ సినిమా ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొన్నది. సెన్సార్ అధికారుల నుంచి కూడా భారీగా ప్రశంసలు వచ్చాయన్న విషయం తెలిసిందే. విద్యా వ్యవస్థలోని లోపాలపై సమాజాన్ని ఆలోచింపజేసే సినిమాగా తెరకెక్కడంపై సెన్సార్ అధికారులు.. తమ సంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది.

తెలుగు, తమిళ రాష్ట్రాలలో..

ఏపీ, తెలంగాణలో ముఖ్యంగా తమిళనాడులో ధనుష్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదే అదనుగా భారీగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. తమిళనాడులో 500 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణలో కలిపి ఈ సినిమాను సమారు 600 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే సార్ సినిమా రిలీజ్ కాకముందే మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో.. స్క్రీన్లు పెరిగే అవకాశం ఉందని చర్చలు సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

హిందీ, ఓవర్సీస్‌లో సోని పిక్చర్స్..

ధనుష్ కథానాయకుడిగా నటించిన సార్ సినిమాను ఉత్తరాదిలోను, అలాగే ఓవర్సీస్‌లోను భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను హిందీలో, ఇంకా విదేశాల్లో సోని పిక్చర్స్ రిలీజ్ చేస్తోంది. హిందీలో ధనుష్‌కు ఉన్న మార్కెట్‌కు తగినట్టుగా ప్రధాన నగరాల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు సినీ డిస్ట్రిబ్యూటర్లు. ఇక పలుదేశాల్లో ఈ సినిమాను ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారిన సినీ వర్గాల నుంచి అందిన సమాచారం.

అమెరికాలో కూడా అదే హవా..

అమెరికాలో కూడా సార్(వాతి) సినిమా ఫీవర్ మొదలైంది. ఈ సినిమాను అమెరికాలో మొత్తంగా 161 కేంద్రాల్లో రిలీజ్ చేస్తున్నారు చిత్న నిర్మాతలు. తమిళం కంటే తెలుగు వెర్సన్‌కు మంచి క్రేజ్ కనిపిస్తున్నది. దాదాపు 270 షోలు ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. అడ్వాన్స్ బుకింగ్ పరంగా 5250 డాలర్లు, తమిళంలో 4250 అమెరికన్ డాలర్లు అంటే.. 9 వేల డాలర్లకు పైగా వసూలు చేసింది సార్ మూవీ.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..