Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Laptops: ‘దేశంలోని విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్స్’.. క్లారిటీ ఇదే..

ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనేే ఇటీవల దేశంలోని విద్యార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లను

Free Laptops: ‘దేశంలోని విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్స్’.. క్లారిటీ ఇదే..
Free Lapops And Fact Check
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 16, 2023 | 6:43 PM

ప్రస్తుత కాలంలో సమాజంపై సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువైపోయింది. నెట్టింట వచ్చే ప్రతి వార్త నిజమనేవారు కూడా రానురానూ పెరిగిపోతున్నారు. ఇదే అదనుగా సైబర్ మోసగాళ్లు కూడా తెలివి మీరిపోయారు. ఆశచూపే ఆఫర్లతో లింకులను క్రియేట్ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు. వీటిపై క్లిక్ చేస్తే క్షణాల్లో మన వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ డిటెయిల్స్ సైబర్ మోసగాళ్ల చెంతకు చేరినట్లే. ఈ విషయం తెలియని అమాయకులు వీటిపై క్లిక్ చేసి నిలువెల్లా మోసపోతున్నారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి సైబర్ మోసాలు, ఘటనలు బాగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనేే ఇటీవల ‘దేశంలోని విద్యార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లను అందిస్తోంది. ఉచిత ల్యాప్‌టాప్ కోసం కింద ఇచ్చిన లింక్‌లో మీ వివరాలను రిజిస్టర్ చేసుకోండి’ అంటూ ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే వాట్సాప్ గ్రూప్‌లలో సైతం తెగ చక్కర్లు కొట్టడంతో.. ఈ విషయం విద్యార్థులలో గందరగోళ వాతావరణం కలిగించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

ఈ నేపథ్యంలోనే  ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా ఫాక్ట్ చెక్ కూడా పూర్తి క్లారిటీ ఇచ్చింది. ‘దేశంలోని విద్యార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లను ఇవ్వనుందని ఒక వెబ్‌సైట్ లింక్ సర్క్యూలేట్ అవుతుంది. అలా వైరల్ అవుతున్న లింక్ పూర్తిగా ఫేక్. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని అమలు చేయడం లేదు’ అని పేర్కొంది. ఇంకా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తని ప్రజలు నమ్మవద్దని.. అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్‌లను ఓపెన్ చేయవద్దని సూచించింది. ఇంకా సైబర్ మోసాల గురించి ప్రజలు అవగాహనతో మెలగాలని.. ఆశ పెట్టేలా సోషల్ మీడియాలో కనిపించే లింకులపై క్లిక్ చేయవద్దని కూడా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..