Cooking Oil Price: సామాన్యుడికి షాక్‌! మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం వల్ల కేవలం రూ.80, రూ.90లు పలికే వంట నూనెలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇక ఏడాదిగా కాస్తా తగ్గుముఖం పట్టాయిలే అనుకునేలోపు..

Cooking Oil Price: సామాన్యుడికి షాక్‌! మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు..
Edible Oil
Follow us

|

Updated on: Feb 16, 2023 | 5:43 PM

వంటనూనెల ధరలు మళ్లీ పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం వల్ల కేవలం రూ.80, రూ.90లు పలికే వంట నూనెలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇక ఏడాదిగా కాస్తా తగ్గుముఖం పట్టాయిలే అనుకునేలోపు తగ్గినట్లు తగ్గి రూ.150లకుపైనే ఉన్నాయి. పెరిగిన ఇంధన ధరలతో ఇప్పటికే తలలు పట్టుకుంటున్న వినియోగదారులపై మరో పిడుగు పడేందుకు సిద్ధం ఉంది. మన దేశంలో అత్యధికంగా ఉపయోగించే పామాయిల్‌ను ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. తాజాగా ఆ దేశం పామాయిల్‌ దిగుమతులపై ఆంక్షలు విధిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇండోనేషియా నుంచి పామాయిల్‌ దిగుమతి తగ్గితే దాని ప్రభావం వంటనూనెల ధరలపై పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా దేశీమార్కెట్‌లో పామాయిల్‌తో సహా వంటనూనెల ధరలు పది శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మరోమారు వంటనూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపనున్నాయి. దేశంలో మొత్తం వంటనూనెల వినియోగంలో పామాయిల్ వాటా 40 శాతానికి పైగానే ఉంటుంది. ప్రతీ ఏటా ఇండోనేషియా నుంచి 80 వేల టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. గతేడాది కూడా ఇండోనేషియా ఇలానే ఒక్కసారిగా పామాయిల్ ఎగుమతులను నిలిపివేసింది.ఈ సమయంలో భారత్ మలేషియా నుంచి ఎక్కువ మొత్తంలో పామాయిల్ ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో దేశీయ మార్కెట్ లో పామాయిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.

మరోవైపు సెప్టెంబరు 2021 నుంచి అత్యధికంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులకు దారితీసింది. ఈ క్రమంలో వంటనూనెల ధరలు జనవరిలో 33 శాతం పెరిగాయి. జనవరిలో వెజిటబుల్‌ నూనెల (ఎడిబుల్, నాన్-ఎడిబుల్ నూనెలు) దిగుమతులు గతేడాది ఇదే నెలలో 12,70,728 టన్నుల నుంచి 31 శాతం పెరిగి 16,61,750 టన్నులకు చేరాయి. ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు జనవరిలో 16,61,750 టన్నులకు పెరిగాయి. నవంబర్ 2022 – జనవరి 2023 కాలంలో ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు 36,07,612 టన్నుల నుంచి 47,46,290 టన్నులకు పెరిగాయి. ఇక వంట నూనెల ఎగుమతులు 63,549 టన్నుల నుంచి 27,129 టన్నులకు తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు 4,61,000 టన్నులకు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల సన్‌ఫ్లవర్‌ నెలవారీ దిగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ దిగుమతుల పెరుగుదల వల్ల పామాయిల్ దిగుమతులు తగ్గి, దాని ధరలపై భారం పడే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.