Driving Licence: డ్రైవింగ్‌ చేస్తూ ఫోన్‌ మాట్లాడినందుకు బస్‌ డ్రైవర్‌ లైసెన్స్‌ రద్దు..!

డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో పదే పదే ఫోన్‌ మాట్లాడుతున్న దృష్యాలను ఓ మహిళా ప్రయాణికురాలు ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో..

Driving Licence: డ్రైవింగ్‌ చేస్తూ ఫోన్‌ మాట్లాడినందుకు బస్‌ డ్రైవర్‌ లైసెన్స్‌ రద్దు..!
Driving Licence Suspension
Follow us

|

Updated on: Feb 15, 2023 | 9:15 PM

ఫోన్‌ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసిన ఓ బస్సు డ్రైవర్‌ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేశారు. కోరళ రాష్ట్రంలోని కోజికోడ్ – పరప్పనంగడి సర్వీసు మార్గంలో జామ్ జామ్ ప్రైవేట్‌ బస్‌ డ్రైవర్‌గా ఉన్న సుమేష్ అనే వ్యక్తి డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో పదే పదే ఫోన్‌ మాట్లాడుతున్న దృష్యాలను ఓ మహిళా ప్రయాణికురాలు ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అది కాస్త వైరల్‌ అవ్వడంతో అధికారుల కంటపడింది. సదరు వీడియోలో డ్రైవర్‌ సుమేష్‌ 7 కిలోమీటర్ల వ్యవధిలో దాదాపు ఎనిమిది సార్లు ఫోన్‌ మాట్లాడినట్లు కనిపిస్తుంది. బస్ నడుపుతూనే వాట్సప్‌లో మెసేజ్‌లను పంపడం కూడా వీడియోలో కనిపిస్తుంది.

దీంతో రంగంలోకి దిగిన కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ఫెరోక్‌ చెందిన జాయింట్ ఆర్టీవో అధికారులు సుమేష్‌ డ్రైవింగ్ లైసెన్స్‌ను నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు. అంతేకాకుండా మలప్పురం జిల్లా ఎడప్పల్‌లోని మోటర్ వెహికల్ డిపార్ట్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో సదరు డ్రైవర్‌కు వారం రోజుల పాటు కంపల్సరీ కోచింగ్ ఇవ్వాలని పేర్కొంటూ జాయింట్ ఆర్టీఓ ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా జామ్ జామ్‌ బస్సు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆర్టీఏ ఆధికారులు రెండు వేల రూపాయలు జరిమానా విధించినట్లు కోజికోడ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.