AP News: ‘సారూ..! మేమెక్కడ తాగాలో మీరే చెప్పండి..’ పోలీసుల ఎదుట మందుబాబుల నిరసన..

మద్యం షాపుల్లో లిక్కర్‌ బాటిళ్లు కొనుగోళ్లు చేసి.. సమీపంలోని షాపుల వద్ద, ఇతర ప్రదేశాల్లో మద్యం సేవించి.. రోడ్లపై నానాహంగామా చేస్తున్న మందుబాబులపై..

AP News: 'సారూ..! మేమెక్కడ తాగాలో మీరే చెప్పండి..' పోలీసుల ఎదుట మందుబాబుల నిరసన..
AP News
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 15, 2023 | 6:23 PM

మద్యం షాపుల్లో లిక్కర్‌ బాటిళ్లు కొనుగోళ్లు చేసి.. సమీపంలోని షాపుల వద్ద, ఇతర ప్రదేశాల్లో మద్యం సేవించి.. రోడ్లపై నానాహంగామా చేస్తున్న మందుబాబులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన మంగళవారం (ఫిబ్రవరి 14) రాత్రి తిరుపతి జిల్లా వాకాడులో చోటుచేసుకుంది.

వాకాడులోని స్థానిక అశోకస్తంభం వద్ద మద్యం దుకాణం నిర్వహిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద తాగొద్దని సర్కార్ హుకూం జారీ చేయడంతో సమీప శీతల పానీయాల దుకాణాల్లో, చర్చికి వెళ్లే మార్గంలో కొందరు మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో వారితో ఎదురవుతున్న ఇబ్బందులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్సై రఘునాథ్‌ మద్యం దుకాణం సమీపంలోని మందుబాబులను మందలించారు. దీంతో మందుబాబులు ఆయనతో వాదనకు దిగారు. ‘మద్యం దుకాణం వద్ద తాగొద్దంటిరి. సమీపంలోని ఇతర దుకాణాల వద్దా వీల్లేదంటిరి. ఇంటికిపోతే మా పెళ్లాలు ఇంట్లో తాగొద్దంటున్నారు. ఇంకెక్కడ తాగాలో మీరే చెప్పండి సారూ..’ అంటూ కొందరు ఎస్సై ఎదుట నిరసన తెలిపారు. వెళ్లకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి, వారిని అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.