Valentine’s Day Gift: ‘నేను, నా ప్రియురాలు.. మేడం మేక’ వాలెంటైన్స్ డేకి గిఫ్ట్ ఇద్దామని వెళ్లి అడ్డంగా బుక్కైన విద్యార్ధి
వాలెంటైన్స్ డే నాడు ప్రియురాలికి గిఫ్ట్ కొనిద్దామనుకున్నాడు ఓ అమర ప్రేమికుడు. చదివేది ఇంజనీరింగ్.. చేతిలో డబ్బులేదు.. ఎలాగైన గర్ల్ ఫ్రెండ్‌కి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అందుకు ఓ పథకం పన్నాడు. తీరా సీన్‌లోకి ఎంటర్ అయ్యాక కథ అడ్డం..
వాలెంటైన్స్ డే నాడు ప్రియురాలికి గిఫ్ట్ కొనిద్దామనుకున్నాడు ఓ అమర ప్రేమికుడు. చదివేది ఇంజనీరింగ్.. చేతిలో డబ్బులేదు.. ఎలాగైన గర్ల్ ఫ్రెండ్‌కి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అందుకు ఓ పథకం పన్నాడు. తీరా సీన్‌లోకి ఎంటర్ అయ్యాక కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడులోని కాంచీపురం సమీపంలోని మలైయరసన్ కుప్పం ప్రాంతంలో రేణుకా అనే మహిళకు వందల సంఖ్యలో మేకలు, గొర్రెలు ఉన్నాయి. రేణుక దంపతుల ఇంటి సమీపంలో పెద్ద రేకుల షేడ్ ఏర్పాటు మేకలను విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ముతో జీవనం సాగిస్తోంది. రేణుకా పెంచుతున్న మేకల భద్రత కోసం ఓ వ్యక్తి రోజు అర్దరాత్రి వరకు కాపలా ఉంటున్నాడు. అర్దరాత్రి దాటిన తర్వాత ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై వచ్చి ఓ మేకను బైక్‌పై ఉంచుకుని అక్కడి నుంచి బయల్దేరారు. ఈలోపు చోరీకి గురైన మేక ‘మే..మే..’ అంటూ అరిచింది.
దీంతో తోటి మేకలు కూడా గోళ చేయడంతో రేణుక కుటుంబ సభ్యులు నిద్రలేచారు. బయటికి వచ్చి చూడగా బైక్‌పై మేకను ఎత్తుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కనిపించారు. దీంతో రేణుక దొంగ.. దొంగ అని కేకలు వేయడంతో గ్రామస్తులు నిద్రలేచి బైక్‌పై పారిపోతున్న యువకులను పట్టుకుని కాంచీపురం పోలీసులకు అప్పగించారు. దొంగలను ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి అరవింద్ కుమార్ (20), అతని స్నేహితుడు మోహన్ (20)లుగా పోలీసులు గుర్తించారు. గర్ల్ ఫ్రెండ్‌కి గిఫ్ట్ కొనడానికి డబ్బుల్లేక మేకను దొంగిలించినట్లు విచారణలో బయటపడటంతో ఖాఖీలు షాక్‌కు గురయ్యారు. కంచీపురంలోని ఇతర ప్రాంతాల్లో మేకల దొంగతనానికి సంబంధించి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.