Valentine’s Day Tragedy: పెద్దలకు చెప్పకుండా గోవాకు వెళ్లి.. బీచ్‌లో శవాలై తేలి..
వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా వెళ్లిన ఓ ప్రేమ జంట అనుమానాస్పదరీతిలో బీచ్‌లో విగతజీవులుగా మారారు. ఈ విషాద ఘటన బుధవారం (ఫిబ్రవరి 14న) చోటు చేసుకుంది..
వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా వెళ్లిన ఓ ప్రేమ జంట అనుమానాస్పదరీతిలో బీచ్‌లో విగతజీవులుగా మారారు. ఈ విషాద ఘటన బుధవారం (ఫిబ్రవరి 14న) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన విభు శర్మ(27), సుప్రియా దుబే (26) బంధువులు. విభు శర్మ ముంబాయిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో, సుప్రియా దుబే బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవడానికి వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా గోవాకు చేరుకున్నారు. గత రెండు రోజులుగా పాలోలెమ్ బీచ్ పరిసర ప్రాంతాల్లో సుప్రియ, విభులను చూసినట్లు స్థానికులు సైతం తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి డిన్నర్ తర్వాత బీచ్‌లో స్విమ్మింగ్‌కు వెళ్లారు.
ఏం జరిగిందో.. ఏమో గానీ.. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పలోలెం సమీపంలోని ఊరెమ్ బీచ్ స్ట్రెచ్ వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ ప్రదేశానికి కొద్ది దూరంలో మధ్యాహ్నం సమయానికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతులను విభు, సుప్రియాలుగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సముద్రంలోకి వెళ్లే ముందు ఇద్దరూ డిన్నర్, డ్రింక్స్ తీసుకున్నట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు కెనకోనా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.