Big News Big Debate: ఏపీ రాజధానిపై కన్ఫ్యూజన్ ఎవరికి..? తారాస్థాయికి చేరిన సవాళ్ల యుద్ధం..
రాజధాని వ్యవహారం సర్దుమణిగింది అనుకున్న ప్రతిసారీ ఏదో రూపంలో రాజుకుంటూనే ఉంది. తాజాగా బెంగళూరులో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేపిటల్ సిటీపై చేసిన వ్యాఖ్యలు ఈసారి దుమారాన్ని రేపుతున్నాయి.
రాజధాని వ్యవహారం సర్దుమణిగింది అనుకున్న ప్రతిసారీ ఏదో రూపంలో రాజుకుంటూనే ఉంది. తాజాగా బెంగళూరులో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేపిటల్ సిటీపై చేసిన వ్యాఖ్యలు ఈసారి దుమారాన్ని రేపుతున్నాయి. కర్నూలు, గుంటూరు రాజధాని కాదని.. విశాఖపట్నం రాజధానిగా నిర్ణయించామన్నారు బుగ్గన. వెంటనే లైన్‌లోకి వచ్చిన విపక్షాలు అంటే మూడు రాజధానులు కూడా మీ విధానం కాదా అంటూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. మా విధానం మూడు రాజధానులే చట్టం కూడా తీసుకొస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. అయినా సవాళ్లు మాత్రం కొనసాగుతున్నాయి.
మూడు రాజధానులే మా విధానం అని బిల్లు పెట్టినప్పుడు.. అనంతరం సాంకేతిక కారణాలతో వికేంద్రీకరణ చట్టం రద్దు చేసినప్పుడు గంటల కొద్దీ అసెంబ్లీలో ప్రసంగించిన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లేటెస్టుగా బెంగళూరులో చేసిన హాట్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
త్రీ కేపిటల్స్ సమాచారలోపమని.. రాజధానిగా విశాఖనే నిర్ణయించామని బుగ్గన చెప్పిన ఒక్క మాటను ఏపీలోని విపక్షాలు ఆయుధంగా మలుచుకున్నాయి. ఇంతకాలం మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాల్లో చెప్పిన వైసీపీ తన విధానంపైనా మడమతిప్పిందా అంటూ నోటికి పనిచెప్పారు. విశాఖ రాజధాని ఎవరూ కోరుకోవడం లేదంటున్న లెఫ్ట్ తో పాటు జనసేన పార్టీలు వైసీపీకి ఓపెన్ సవాల్ విసిరాయి.
విధానం మారలేదు.. మూడు రాజధానులపై మా నినాదం కూడా మారదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సజ్జల.. మంత్రి బుగ్గన మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు. మీరు సవాళ్లు చేయడం ఏంటి.. తమ ఎన్నికల అజెండాలో రాజధాని అంశం కూడా ఉంటుందని స్పష్టత ఇచ్చింది వైసీపీ. అంతేకాదు కోర్టు తీర్పులకు అనుగుణంగానే సీఎం విశాఖ వెళతారంటూ కూడా స్పష్టత ఇచ్చింది వైసీపీ.
ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న రాజధాని వ్యవహారం రాజకీయ పార్టీలకు ఆహారంగా మారింది. కేపిటల్ కహానీ సజీవంగా ఉంచి ఎంతోకొంత లబ్ధి పొందే ప్రయత్నంలో అన్ని పార్టీలున్నాయా?
బిగ్ న్యూస్ బిగ్ డిబెట్ వీడియో చూడండి..
మరిన్ని ఏపీ వార్తల కోసం..