Andhra Pradesh: సాధారణ తనిఖీలు.. అనుమానాస్పదంగా కనిపించిన డెలివరీ బాయ్.. అతడి బ్యాగ్ చెక్ చేయగా
నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మత్తు పదార్ధాల సప్లైలో క్రియేటివ్ ఐడియాస్‌ను అమలు చేస్తూ..
నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మత్తు పదార్ధాల సప్లైలో క్రియేటివ్ ఐడియాస్‌ను అమలు చేస్తూ.. అంతుచిక్కని మార్గాల్లో రహస్యంగా గంజాయిని అక్రమ రవాణా సాగిస్తున్నారు. తాజాగా వినియోగదారులకు ఫుడ్ డెలివరీ బాయ్ వేషంలో గంజాయిని సరఫరా చేస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర నుంచి 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పరిధిలో ఉన్న పురుషోత్తపురం జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. ఇక అటుగా వచ్చిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అనుమానాస్పదంగా కనిపించడంతో.. అతడ్ని అదుపులోకి తీసుకుని బ్యాగ్ చెక్ చేయగా.. భారీగా గంజాయి బయటపడింది.
పురుషోత్తపురంలోని రెయ్యి నర్సింహులు అనే వ్యక్తికి గంజాయి సప్లయ్ చేయడానికి బరంపురానికి చెందిన సంతోష్ మహంతి.. పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశంతో డెలివరీ బాయ్‌గా వేషం మార్చాడు. కానీ అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ ఘటనలో సంతోష్ మహంతితో పాటు కైలాష్ చంద్రబెహర, మరో వ్యక్తిని పోలీసులు, SEB అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, గతంలో మహంతిపై మర్డర్ కేసు, కైలాస్ చంద్రబెహరపై గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..