Prabhas: ప్రభాస్‌తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? అయ్యబాబోయ్! ఇంతలా మారిందేంటి..
హీరో ప్రభాస్ నటించిన మొదటి సినిమా మీకు గుర్తుందా.? ఈ క్వశ్చన్‌కు అందరూ కూడా..
హీరో ప్రభాస్ నటించిన మొదటి సినిమా మీకు గుర్తుందా.? ఈ క్వశ్చన్‌కు అందరూ కూడా అదేనండీ..! దర్శకుడు జయంత్.సి. పరాన్జీ తెరకెక్కించిన ‘ఈశ్వర్’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్. ఈమె ఇప్పటికీ టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గుర్తుంటుంది.
1992లో ‘రిక్షా మామ’ అనే తమిళ చిత్రంతో తొలుత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీదేవి. బాలనటిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె.. 2002లో ప్రభాస్ నటించిన ‘ఈశ్వర్’ సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మూవీతో శ్రీదేవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అనంతరం ఆమెకు వరుసగా అటు తమిళం.. ఇటు తెలుగులో అవకాశాలు వచ్చాయి. అయితే తమిళంలో కంటే.. తెలుగులోనే శ్రీదేవికి బాగా క్రేజ్ వచ్చింది. ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘నిరీక్షణ’, ‘ఆదిలక్ష్మీ’, ‘పెళ్ళికాని ప్రసాద్’ లాంటివి శ్రీదేవి కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాలు. ఇలా కెరీర్‌లో మంచి పీక్ స్టేజిలో ఉన్నప్పుడు.. రాహుల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది శ్రీదేవి. ఈ జంటకు రూపిక అనే పాప ఉంది.
ఇక శ్రీదేవి వ్యక్తిగత వివరాల విషయానికొస్తే.. శ్రీదేవి తల్లిదండ్రులు విజయ్ కుమార్, మంజుల.. అలాగే అక్కాచెల్లెళ్లు వనిత విజయ్ కుమార్, ప్రీత విజయ్ కుమార్.. సోదరుడు అరుణ్ విజయ్ కూడా సినీ రంగానికి చెందినవారు.
కాగా, శ్రీదేవి చివరిసారిగా 2011లో రవితేజ నటించిన ‘వీర’ చిత్రం. ఇందులో మాస్ మహారాజ్‌కు చెల్లెలి పాత్రలో కనిపించింది. కాగా. ప్రస్తుతం శ్రీదేవి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ.. మరోవైపు డ్యాన్స్, ఇతర రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
View this post on Instagram