Guess the actress: ఈ చిన్నారి నటనకు దేశమే శభాష్ అంది.. ఇంతకీ ఈ క్యూట్ బేబీ ఎవరో గుర్తుపట్టారా.?
బాల నటిగా కెరీర్ మొదలు పెట్టి అగ్ర కథానాయికలుగా ఎదిగిన వారు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. నట వారసత్వం కేవలం తమకు ఒక ఎంట్రీ పాస్ లాంటిది మాత్రమేనని తమ ట్యాలెంట్‌తో ప్రేక్షకులను రంజింజేసిన వారు ఇండస్ట్రీలో చాలా అరుదు. ముఖ్యంగా హీరోయిన్లుగా రాణించిన వారు సంఖ్య..

బాల నటిగా కెరీర్ మొదలు పెట్టి అగ్ర కథానాయికలుగా ఎదిగిన వారు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. నట వారసత్వం కేవలం తమకు ఒక ఎంట్రీ పాస్ లాంటిది మాత్రమేనని తమ ట్యాలెంట్‌తో ప్రేక్షకులను రంజింజేసిన వారు ఇండస్ట్రీలో చాలా అరుదు. ముఖ్యంగా హీరోయిన్లుగా రాణించిన వారు సంఖ్య వేళ్లపై లెక్కించ వచ్చు. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారికి కూడా ఈ జాబితాలోకి వస్తుంది. బాల నటిగా కెరీర్ మొదలు పెట్టి, దేశమే గర్వించదగ్గ నటిగా ఎదిగిందీ చిన్నారి.
తల్లితో పార్కులో ఎంజాయ్ చేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగుతో పాటు, తమిళంలోనూ మెప్పించింది. ఈ చిన్నారి మాత్రమే కాదు, పక్కన కూర్చున్న ఆమె మధర్ కూడా ఒకప్పటి నటినే. 2000 సంవత్సరంలో మలయాళం మూవీ ద్వారా బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నారి 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు వరుస సినిమాల్లో నటించి మెప్పించి ఈ ముద్దుగుమ్మ 2017లో వచ్చిన తెలుగు సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈపాటికే ఈ చిన్నారి ఎవరో మీకు అర్థమైపోయినట్లుంది కదూ.! అవును మీ గెస్ కరెక్ట్ మీ పాప మరెవరో కాదు ఇప్పటి మహానటి కీర్తి సురేషే.




సినిమా సినిమాకు నటనలో పరిపక్వత చెందుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉంది. ఏకంగా 6 సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే కీర్తి సురేస్ తల్లి మేనక ఒకప్పటి మలయాళ స్టార్ హీరోయిన్. సుమారు 125 సినిమాల్లో నటించిన మేనక అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




