Car Sale: అదిరిపోయే ఆఫర్.. రూ. 5.60 లక్షల మారుతీ ఏసీ కారు.. కేవలం 1.35 లక్షలకే ఇంటికి తెచ్చుకోండి!
ఫ్యామిలీతో వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా.? లేదా కారులో అలా.. అలా లాంగ్ డ్రైవ్స్ వెళ్లాలనుకుంటున్నారా.? వచ్చేది ఎండాకాలం కాబట్టి..
ఫ్యామిలీతో వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా.? లేదా కారులో అలా.. అలా లాంగ్ డ్రైవ్స్ వెళ్లాలనుకుంటున్నారా.? వచ్చేది ఎండాకాలం కాబట్టి.. మాంచి ఏసీతో కూడిన ఎక్కువ సీటింగ్ సామర్ధ్యం ఉన్న కార్లు అయితే చాలా బెస్ట్. అయితే ఈ సమయంలో 5 సీటర్ ఏసీ కార్లు కొనాలంటే దాదాపుగా రూ. 5-8 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్నది తక్కువ బడ్జెట్ అయితే.. ఇది మీకోసమే. 5 సీటర్ AC మారుతి Eeco ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.60 లక్షలు అయినప్పటికీ, మీరు దానిని కేవలం రూ. 1.35 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఎలాగంటారా.? మారుతి Eeco మోడల్‌పై సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు పలు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులో ఉంచాయి. తక్కువ బడ్జెట్, మంచి మైలేజ్‌తో ఆ కారును మీరు సొంతం చేసుకోవచ్చు. మరి ఆ డీల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందామా.?
-
Maruti Eeco 5 Seater CarWale ఆఫర్:
మీరు మారుతి సుజుకి Eeco 2018 మోడల్‌ను కేవలం రూ. 2 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఈ 5 సీటర్ మారుతి ఈకోలో పెట్రోల్‌తో పాటు CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో లభిస్తుండగా.. ఈ వాహనం ఇప్పటివరకు 50 వేల కిలోమీటర్లు తిరిగింది. ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఉంది.
-
మారుతి Eeco AC 5 సీటర్ OLX ఆఫర్:
మారుతి Eeco AC 2012 మోడల్ OLXలో అందుబాటులో ఉంది. కేవలం రూ.1.95 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఈ AC కారులో పెట్రోల్‌తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది. ఇప్పటివరకు ఈ కారు 65,000 కిలోమీటర్లు నడిచింది. ఇది ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో లభిస్తుంది.
-
మారుతి Eeco AC 5 సీటర్ TrueValue ఆఫర్:
మారుతి Eeco AC చౌకైన ఆఫర్ ట్రూ వాల్యూలో లభిస్తోంది. మీరు ఇక్కడ ఈ కారు 2017 మోడల్‌ను కేవలం రూ.1.35 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ వాహనం ఇప్పటివరకు 91,804 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈకో మోడల్ గుజరాత్‌లోని సూరత్ రిజిస్ట్రేషన్‌తో లభిస్తోంది. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి.