Ram Charan: ‘ఆమె నా ఫస్ట్‌ క్రష్‌.. ఎప్పుడు కనిపించినా కళ్ళప్పగించి చూస్తూనే ఉంటా’

హీరో రామ్‌ చరణ్‌ వ్యక్తిగత, సినిమాకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల ఓ ఇంటర్నేషనల్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్‌ ఫస్ట్‌ క్రష్‌ ఎవరని ఓ అభిమాని ప్రశ్నించగా..

Ram Charan: 'ఆమె నా ఫస్ట్‌ క్రష్‌.. ఎప్పుడు కనిపించినా కళ్ళప్పగించి చూస్తూనే ఉంటా'
Ram Charan First Crush
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 15, 2023 | 8:40 PM

హీరో రామ్‌ చరణ్‌ వ్యక్తిగత, సినిమాకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల ఓ ఇంటర్నేషనల్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్‌ ఫస్ట్‌ క్రష్‌ ఎవరని ఓ అభిమాని ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘హాలీవుడ్‌ హీరోయిన్స్‌ జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా జోన్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. జూలియా రాబర్ట్స్‌ నా ఫస్ట్‌ క్రష్‌. ఆమెను టీవీలో చూసినా, బిగ్‌ స్క్రీన్‌పై చూసినా కళ్లార్పకుండా అలా చూస్తూ ఉండిపోతాను. ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది. ‘ప్రెట్టీ ఉమెన్‌’ సినిమా చూశాక, ఆమెకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను. నా మరో క్రష్‌.. కేథరిన్‌ జెటా జోన్స్‌. ఆమె నటించిన సినిమాల్లో నేను మొదట చూసింది ‘ది మార్క్‌ ఆఫ్‌ జోరో’. ఆ మువీలో కేథరిన్‌ నటన నన్నెంతో ఆకట్టుకుంది’ అని అన్నారు.

ఇంటరాక్షన్ సమయంలో సోషల్‌ మీడియాలో వచ్చిన కామెంట్స్‌ను ఇంటర్వ్యూవర్ ఒక్కొక్కటిగా చదివి వినిపించారు. వారిలో ఓ అభిమాని చరణ్‌ను ‘స్నాక్‌’ అని అభివర్ణించారు. దీంతో చరణ్‌ పెద్ద నవ్వి ఈ కామెంట్‌ను నా వైఫ్‌ వింటే గర్వంగా ఫీలవుతుందన్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. స్టార్‌ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ తదుపరి మువీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. నేడు డైరెక్టర్‌ బర్త్‌డే సందర్భంగా వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. బుచ్చిబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.