Bank Alert: బ్యాంక్ లాకర్‌లో నగదు పెడుతున్నారా? కీలక అప్‌డేట్ ఇప్పుడే తెలుసుకోండి..
ప్రస్తుత కాలంలో చాలా మంది తాము సంపాదించిన సొమ్మును ఇంట్లో దాచుకోవడం కంటే.. బ్యాంకు లాకర్‌లో దాచుకోవడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. చాలా మంది బ్యాంక్ లాకర్‌లో ఆస్తి పత్రాలు..
ప్రస్తుత కాలంలో చాలా మంది తాము సంపాదించిన సొమ్మును ఇంట్లో దాచుకోవడం కంటే.. బ్యాంకు లాకర్‌లో దాచుకోవడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. చాలా మంది బ్యాంక్ లాకర్‌లో ఆస్తి పత్రాలు, నగలు వంటివి దాస్తారు. మరికొందరు డబ్బును కూడా దాచిపెడతారు. అయితే, ఇక నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. బ్యాంక్ లాకర్‌లో నగదు పెట్టడానికి వీలు లేదు. ఇందుకు సంబంధించి బ్యాంకుతో కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలని కస్టమర్లకు సూచించింది ఆర్బీఐ. రూ. 200 స్టాంపు పత్రాలపై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాలని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ కొత్త విధానానికి సంబంధించిన అగ్రిమెంట్ గడువు జనవరి 1వ తేదీతోనే ముగియగా.. ఇప్పుడు మళ్లీ పొడగించింది ఆర్బీఐ.
కొత్త రూల్స్‌కి సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవడానికి ఆర్‌బిఐ డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చింది. అయితే, గడువు ముగిసినా చాలా మంది కస్టమర్స్ తమ తమ బ్యాంక్స్‌తో అగ్రిమెంట్ చేసుకోలేదు. దాంతో గడువు ముగిసినా.. అగ్రిమెంట్ చేసుకోని వారి లాకర్లను సీజ్ చేశాయి బ్యాంకులు. అయితే, తాజాగా బ్యాంకులకు ఆర్‌బిఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త రూల్స్‌కి సంబంధించి ఒప్పందాలు చేసుకోని వారికి మరో అవకాశం ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది.
కొత్త ఒప్పందాలకు సంబంధించి కీలక ప్రకటన చేసిన ఆర్‌బిఐ.. బ్యాంకులకు 3 దశల లక్ష్యాలను పెట్టింది. ఈ మూడు దశల్లోగా కస్టమర్లందరితో ఒప్పందాలు చేయించాలని స్పష్టం చేసింది. జూన్ 30 లోపు 50 శాతం, సెప్టెంబరు 30 లోపు 75, డిసెంబరు 31 లోపు 100 శాతం మంది వినియోగదారుల నుంచి ఒప్పందాలు పూర్తి చేయాలంది. ఈ గడువు తేదీలకు సంబంధించి వివరాలను వినియోగదారులందరికీ పంపాలని అన్ని బ్యాంకులను ఆదేశించింది ఆర్‌బిఐ.
కొత్త రూల్ ప్రకారం నగదు దాచుకోవద్దు..
ఆర్‌బిఐ కొత్త ఒప్పందం ప్రకారం.. లాకర్లలో నగదు దాచుకోవడానికి అవకాశం లేదు. కస్టమర్లకు లాకర్ కేటాయించే సమయంలోనే ఈ కండీషన్స్‌కి సంబంధించి ఒప్పందాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం.. లాకర్ వార్షిక నిర్వహణకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని కస్టమర్లు ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, లాకర్లలో అక్రమ నగదు నిల్వలలను అరికట్టే ఉద్దేశ్యంతోనే ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే లాకర్లలో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనే వివరాలను స్పష్టం చేసింది.
లాకర్లలో ఏం పెట్టాలి..
నగలు వంటి విలువైన వస్తువుల పెట్టుకొచ్చు.
ఆస్తి పత్రాలు, ఇతర పత్రాలను భద్రపరుచుకోవచ్చు.
ఏం పెట్టకూడదు..
నగదు/కరెన్సీ నోట్లను లాకర్‌లో పెట్టకూడదు.
మాదకద్రవ్యాలు, నిషిద్ధ వస్తువులు ఉంచకూడదు.
బ్యాంకుకు, ఖాతాదారులకు హానీ కలిగించే చట్టవిరుద్ధమైనవి ఉంచకూడదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..