Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cute Video: ఇదెక్కడి మాస్ కంప్లెయింట్‌రా బాబు.. తండ్రిపై తల్లికి ఫిర్యాదు చేసిన చిన్నారి.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..

చిన్నారి తనతో ఆడకోవడానికి రాకుండా ఫోన్ యూజ్ చేసినందుకు తన తండ్రిపై తల్లికి కంప్లెయింట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆ చిన్నారి మాట్లాడిన క్యూట్..

Cute Video: ఇదెక్కడి మాస్ కంప్లెయింట్‌రా బాబు.. తండ్రిపై తల్లికి ఫిర్యాదు చేసిన చిన్నారి.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..
Chilf Complaints About Her Father To Mother
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 16, 2023 | 7:41 PM

చిన్న పిల్లల మాటలు చాలా ముద్దుముద్దుగా ఉంటాయి. అందుకే అందరూ కూడా చిన్నారులతో తమ సమయాన్ని వెచ్చించాలని చూస్తుంటారు. వారితో గడిపితే ఎంతటి టెన్షన్స్ అయినా తొలగిపోతాయనేది కూడా నిజం. అందుకే ఇంట్లో చిన్న పిల్లలు లేని వారు కూడా సోషల్ మీడియా వేదికగా కనిపించే వీడియోలను చూసి నవ్వేసుకుంటారు. అలాంటి వీడియోలు నిత్యం నెట్టింట షేర్ అవడానికి, వైరల్ అవడానికి ఇది కూడా ఒక కారణం. అయితే ఇప్పుడు కూడా ఒక చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా చిన్న పిల్లలంటే కడుపు నొప్పి, తలనొప్పి అంటూ స్కూల్‌కి వెళ్లనందుకు సాకులు చెబుతారు. అలాంటి సాకులు మీరు కూడా చెప్పే ఉంటారు కదా..! కానీ ఈ చిన్నారి తనతో ఆడకోవడానికి రాకుండా ఫోన్ యూజ్ చేసినందుకు తన తండ్రిపై తల్లికి కంప్లెయింట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆ చిన్నారి మాట్లాడిన క్యూట్ క్యూట్ మాటలతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను చూస్తే మీ ముఖంలో కూడా చిరునవ్వులు వికసించడం ఖాయం.

meherluthraa అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో మనం ఒక చిన్నారి తన తండ్రిపై తల్లికి ఫిర్యాదు చేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ వీడియోలో ఆ చిన్నారి ‘నాన్నతో కలిసి ఆడుకోవడానికి నేను వస్తే.. మీరు ఆడుకోండని చెప్పి ఫోన్ వాడుకుంటూ ఉండిపోయాడు. నేను నీతో చెప్పడానికి వస్తుంటే.. ఫోన్ యూజ్ చేస్తున్నానని అమ్మకు చెప్పకని నాతో చెప్పాడు నాన్న’అని తన తల్లితో చెప్పింది. అలాగే తన తండ్రి వైపు చూసి ‘నాన్న నన్ను అలా చూడకు. కొంచెం నవ్వు.. ఎప్పుడు చూసినా ఫోన్ వాడుతూనే ఉంటావు. అమ్మ బాధపడితే నేను కూడా బాధపడతాను. నేను కూడా ఏడవడం మొదలుపెడతాన’ని కూడా అంటుంది. ఇంత క్యూట్ క్యూట్‌గా మాట్లాడిన ఆ చిన్నారి వీడియోకు నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి.. 

View this post on Instagram

A post shared by Meher Luthra (@meherluthraa)

కాగా, ఇప్పటివరకు ఈ వీడియోకు దాదాపు 36 లక్షల వీక్షణలు.. అలాగే సుమారు 2 లక్షల 32 వేల లైకులు కూడా వచ్చాయి. ఇక నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘అమ్మాయి ఎంత ముద్దుగా ఉందో..’  అని కామెంట్ చేశారు. అలాగే మరో నెటిజన్ ‘అలాంటి కూతురుని దేవుడు నాకెందుకు ఇవ్వలేద’ని రాసుకొచ్చారు. ఇంకో నెటిజన్ ‘ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావో చిన్నారి. దేవుడా నాకు కూడా ఇలాంటి కూతురునే ఇవ్వు’ అని కోరుకుంటూ స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి..