AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వాలెంటైన్స్ డే రోజు భర్త చేసిన పనికి కళ్లు తేలేసిన భార్య.. ఏకంగా 8గంటలపాటు ఓర్చుకుని..

ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు.. వాలెంటైన్స్ డే.. ఈ స్పెషల్ డే కోసం ప్రేమికులు ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తుంటారు. తాము ప్రేమించే వ్యక్తులను సర్‌ప్రైజ్‌ చేసేందుకు రకరకాల పద్ధతులను అవలంభిస్తారు.

Viral: వాలెంటైన్స్ డే రోజు భర్త చేసిన పనికి కళ్లు తేలేసిన భార్య.. ఏకంగా 8గంటలపాటు ఓర్చుకుని..
Valentine's Day
Shaik Madar Saheb
|

Updated on: Feb 16, 2023 | 8:01 PM

Share

ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు.. వాలెంటైన్స్ డే.. ఈ స్పెషల్ డే కోసం ప్రేమికులు ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తుంటారు. తాము ప్రేమించే వ్యక్తులను సర్‌ప్రైజ్‌ చేసేందుకు రకరకాల పద్ధతులను అవలంభిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజులో తమ ప్రియురాలు లేదా జీవిత భాగస్వామి పట్ల వినూత్నంగా తన ప్రేమను వ్యక్తపరచాలని తహతహలాడుతుంటారు. తాజాగా.. ఓ భర్త.. తన భార్య మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు వినూత్నరీతిలో ఆలోచించాడు. అతను చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. థాయిలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు.. ఏకంగా మ్యారేజ్‌ సర్టిఫికెట్‌నే పచ్చబొట్టు వేయించుకొని సర్‌ప్రైజ్‌ చేశాడు.

Tattoo

Tattoo

థాయిలాండ్‌కు చెందిన వాల్‌ అనే వ్యక్తి తన చేతిపై వేయించుకున్న టాటూ (పచ్చబొట్టు) దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సెంట్రల్‌ థాయిలాండ్‌లోని సరాబురి ప్రావెన్స్‌లో కెంగ్ ఖోయ్‌లోని టాటూ స్టూడియోలో ఎనిమిది గంటలపాటు కుర్చీలో కూర్చొని.. చేతిపై వివాహ ధ్రువీకరణ పత్రాన్ని టాటూలా వేయించుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, ముందు ఆ టాటూను చూసి అతని భార్య షాక్‌ అయిందని.. ఆ తర్వాత తన పట్ల ప్రేమ, గౌరవానికి రుజువుగా ఆ టాటూను అంగీకరించినట్లు కథనాలు వెలువడ్డాయి.

ఇవి కూడా చదవండి

దీనిపై టాటూ వేసిన ఆర్టిస్ట్‌ మాట్లాడుతూ.. ఇంతకుముందు ఎన్నడూ తాను మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను ఇలా టాటూగా వేయలేదని చెప్పాడు. గతంలో ఓ వ్యక్తి తన భార్య పుట్టిన రోజు సందర్భంగా సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఆమె ముఖచిత్రాన్ని టాటూలా వేయించుకున్న వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

దీనిగురించి టాటూ ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. తాను ఇంతకు ముందు పెళ్లి సర్టిఫికేట్‌ల టాటూలు వేయలేదని చెప్పాడు. ఈ టాటూ వేయడానికి ఎనిమిది గంటలు పట్టిందని.. మొదట చేతిపై నమూనాను కాపీ చేసి, ఆపై డిజైన్‌లోని వివరాలను చాలా జాగ్రత్తగా పచ్చబొట్టు పొడిచినట్లు థాయ్ దినపత్రిక ఖోసోడ్ నివేదించింది.

కాగా.. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. నిజమైన ప్రేమకు నిదర్శనమంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..