No income tax: ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పన్ను చెల్లించవల్సిన అవసరం లేదు.. ఎందుకో తెలుసా..?

నిర్దిష్ట పరిమితికి మించి ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ.. వారి వారి వార్షిక ఆదాయానికి తగినట్లు ప్రభుత్వానికి ఏటా ఆదాయపు పన్ను చెల్లించడం తప్పనిసరి. ఐతే దేశంలోని ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం..

No income tax: ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పన్ను చెల్లించవల్సిన అవసరం లేదు.. ఎందుకో తెలుసా..?
No Income Tax
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 16, 2023 | 8:14 PM

నిర్దిష్ట పరిమితికి మించి ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ.. వారి వారి వార్షిక ఆదాయానికి తగినట్లు ప్రభుత్వానికి ఏటా ఆదాయపు పన్ను చెల్లించడం తప్పనిసరి. వార్షిక బడ్జెట్‌ సమర్పణ సమయంలో ప్రతీయేట ఆదాయపు పన్ను శ్లాబ్‌లో మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. ఐతే దేశంలోని ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం ఎటువంటి పన్నులు చెల్లించనవసరంలేదట. ఉత్తర భారతంలోని హిమాలయాలు, కొండలు, పచ్చని దనానికి నిలయమైన ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం గురించే మనం చర్చిస్తోంది. ఈ రాష్ట్ర జనాభా సుమారు 6.74 లక్షలు. సిక్కిం రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వం పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది.

చుట్టూ కొండలతో ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రానికి ఉత్తర, ఈశాన్యంలో టిబెట్, తూర్పున భూటాన్, పశ్చిమాన నేపాల్, దక్షిణాన పశ్చిమ బెంగాల్ సరిహద్దులుగా ఉన్నాయి. నిజానికి సిక్కిం ఓ పురాతన రాజ్యం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(ఎఫ్) ప్రకారం సిక్కిం పాత చట్టాలు, ప్రత్యేక హోదాతో కొనసాగాలనే షరతుతో భారత్‌లో విలీనం అయ్యింది. ఈ రాష్ట్రం ఇన్‌కంట్యాక్స్‌ మాన్యువల్ 1948ని అనుసరిస్తుంది. ఈ మాన్యువల్ ప్రకారం.. సిక్కిం ప్రజలు కేంద్రానికి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే సిక్కిం ప్రజలకు పాన్‌ కార్డు కూడా అవసరం లేదు.

సిక్కింను చోగ్యాల్ అనే బౌద్ధ రాజు పాలించే రోజుల్లో 1890లో బ్రిటిష్ ఇండియా పాలనలో రాచరిక రాష్ట్రంగా మారింది. 1947 తర్వాత సిక్కిం రిపబ్లిక్ ఆఫ్ ఇండియాతో తన రక్షిత హోదాను కొనసాగించాలనే నిబంధనలతో విలీనం అయ్యింది. 1973లో చోగ్యాల్ ప్యాలెస్ ముందు రాజరిక వ్యతిరేక అల్లర్లు జరిగాయి. 1975లో రాచరికాన్ని తొలగించారు. 1975లో సిక్కిం 22వ రాష్ట్రంగా భారత్‌లో విలీనం అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.