విమానంలో చేతివాటం చూపించిన ప్రయాణికుడు.. ఐఫోన్, ల్యాప్‌టాప్‌తో పరార్!
ఢిల్లీ విమానాశ్రయంలో ఓ వ్యక్తి హ్యాండ్ బ్యాగ్‌ను దొంగిలించిన ఘటనలో పోలీసులు వెబ్ డిజైనర్‌ను అరెస్ట్ చేశారు. ఖరీదైన ఐఫోన్, ల్యాప్‌ట్యాప్, విదేశీ కరెన్సీ ఉన్న బ్యాగ్‌తో..
ఢిల్లీ విమానాశ్రయంలో ఓ వ్యక్తి హ్యాండ్ బ్యాగ్‌ను దొంగిలించిన ఘటనలో పోలీసులు వెబ్ డిజైనర్‌ను అరెస్ట్ చేశారు. ఖరీదైన ఐఫోన్, ల్యాప్‌ట్యాప్, విదేశీ కరెన్సీ ఉన్న బ్యాగ్‌తో ఢిల్లీ ఐజీఐ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వస్తున్న సమయంలో బుధవారం (ఫిబ్రవరి 15) నాడు నిందితుడు చోరీకి యత్నించాడు. నిందితుడిని హరి గార్గ్ (37)గా పోలీసులు గుర్తించారు. జోథ్‌పూర్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తెలింది.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ కుమార్ మహ్లా తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్‌కు చెందిన సురేందర్ సింగ్ అనే వ్యక్తి ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో చేరుకున్నాడు. ఐజీఐ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత అదే విమానంలో ప్రయాణించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫ్లైట్ క్యాబిన్ నుంచి తన బ్యాగ్ తీసుకుని వెళ్లడం గమనించాడు. దీంతో తన బ్యాగ్‌ను దొంగిలించినందుకు ఎయిర్ పోర్టు పోలీసులకు సింగ్ ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫ్లైట్ డీబోర్డింగ్ టైంలో ఉద్దేశ్య పూర్వకంగా నిందితుడు బ్యాగ్‌ను తీసుకెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. బ్యాగ్‌తో జోథ్‌పూర్ చేరుకున్న గర్గ్ పాస్‌పోర్ట్, డెబిట్, క్రెడిట్ కార్డులను బయటపారవేసి ఐఫోన్, ల్యాప్‌ట్యాప్‌లను తన సొంత పనులను వినియోగించడం ప్రారంభించాడు. ఎట్టకేలకు నిందితుడు గర్గ్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు జోథ్‌పూర్‌లోని అతని నివాసంపై దాడి చేసి ఐఫోన్, ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు దేవేష్ కుమార్ మహ్లా తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.