మహిళలు స్నానం చేస్తుంటే 30 ఏళ్లుగా నగ్న వీడియోలు, ఫొటోలు తీస్తూ.. పెద్దోళ్ల చెడ్డ బుద్ధి

మహిళలు స్నానం చేస్తుంటే ఏకంగా 30 ఏళ్లుగా రహస్యంగా ఫొటోలు తీస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పది వేల మందికి పైగా మహిళల వీడియోలు, ఫొటోలను..

మహిళలు స్నానం చేస్తుంటే 30 ఏళ్లుగా నగ్న వీడియోలు, ఫొటోలు తీస్తూ.. పెద్దోళ్ల చెడ్డ బుద్ధి
Hot Springs In Japan
Follow us

|

Updated on: Feb 16, 2023 | 3:03 PM

మహిళలు స్నానం చేస్తుంటే ఏకంగా 30 ఏళ్లుగా రహస్యంగా ఫొటోలు తీస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు పది వేల మందికి పైగా మహిళల వీడియోలు, ఫొటోలను చిత్రీకరించిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకెళ్తే..

జపాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన షిజుఒకకు నిత్యం లక్షల సంఖ్యల్లో పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇక్కడ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన వేడినీటి బుగ్గలు (హాట్‌ స్ర్పింగ్‌) ఉంటాయి. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పలు వేడి నీటి బుగ్గల్లో మహిళలతోపాటు పిల్లలు సరదాగా స్నానాలు చేస్తుంటారు. మహిళలకు, పురుషులకు వేరువేరుగా స్నానాలాంచరించే ప్రదేశాలుంటాయి. ఐతే గత 30 ఏళ్లుగా ఈ వేడి నీటి బుగ్గల్లో స్నానాలు చేస్తున్న దాదాపు 10,000 మందికి పైగా మహిళల వీడియోలను చిత్రీకరించినందుకు 16 మంది నిందితులను జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా వెనుక ప్రధాన సూత్రదారి కరిన్ సైటోను పోలీసులు డిసెంబర్ 2021లో అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకోవడంతో కరినో సైట్‌ వాగ్మూలం ఉపయోగపడింది. హాట్ స్ప్రింగ్స్‌లో స్నానం చేస్తున్న పిల్లలు, మహిళలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తీస్తున్న 16 మందిని షిజుయోకా ప్రిఫెక్చర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వీడియోలను ఓ వెబ్‌సైట్‌కు విక్రయించేవారు. అరెర్టు అయిన నిందితుల్లో సీనియర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు, స్థానిక ప్రభుత్వ అధికారులు, టోక్యోకు చెందిన ఓ వైద్యుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఎంతో కట్టుదిట్టమైన భద్ర ఏర్పాటు చేసినప్పటికీ కరిన్ సైటో గత 30 ఏళ్లుగా మహిళ నగ్న వీడియోలను చిత్రీకరిస్తున్నాడనే విషయం తెలిసి జపాన్‌ పోలీసులు షాక్‌కు గురయ్యారు. నీటి బుగ్గలకు దూరంగా ఉండే కొండల్లో ఆధునాతన టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేసి వీడియోలు ఫొటోలు తీసేవారని విచారణలో తెలిపారు. ఈ ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేసిన వెబ్‌సైట్ల నుంచి వీటిని తొలగించినట్టు జపాన్‌ పోలీసులు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.