Wife – Husband: ఛీ వీడేం మనిషి.. భార్యకు గుండు కొట్టించిన భర్త.. కారణం తెలిస్తే ఏం చేస్తారో మీకే తెలీదు..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో గడిపేందుకు నిరాకరించిందనే కారణంతో.. భార్యకు గుండు కొట్టించాడు ఓ భర్త. ఈ ఘటన లిసాడి గేట్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో గడిపేందుకు నిరాకరించిందనే కారణంతో.. భార్యకు గుండు కొట్టించాడు ఓ భర్త. ఈ ఘటన లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అలీషా, షరీక్ దంపతులు. 5 నెలల క్రితమే వీరికి వివాహం జరిగింది. భర్త షరీక్ రోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో తరచూ గొడవపడటం పరిపాటి. ఈ క్రమంలో తాజాగా మద్యం మత్తులో తన స్నేహితులను ఇంటికి తీసుకువచ్చి.. వారితో వ్యభిచారం చేయాలని భార్యపై ఒత్తిడి చేశాడు. దానికి ఆమె నిరాకరించింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షరీక్.. భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చాడు. అనంతరం ఆమె స్పృహతప్పగానే గుండు కొట్టించాడు. అలీషా స్పృహలోకి వచ్చి చూడగా.. తన జుట్టును కట్ చేసినట్లు గుర్తించి షాక్ అయ్యింది. భర్త చేసిన నిర్వాకానికి తీవ్ర ఆగ్రహానికి గురైన అలీష్.. నేరుగా పోలీసులను ఆశ్రయించింది. భర్త షరీక్ అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్నం గురించి వేధించడమే కాకుండా, తనను వేరే వ్యక్తులతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని, అందుకు ఒప్పుకోకపోవడంతో గుండు కొట్టించాడని ఫిర్యాదులో పేర్కొంది అలీషా. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. షరీక్, అతని తల్లిదండ్రులు, అలీషాను బలవంతం చేయబోయిన ఫరీక్ స్నేహితులను అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..