Dhanush: ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్న హీరో ధనుష్.. మీరు నాలాగా చేయకండి అంటూ రిక్వెస్ట్..

లాక్ డౌన్ సమయంలో వెంకీ అట్లూరి ఈ మూవీ స్టోరీ వినిపించేందుకు నన్ను కలిశారు. అప్పుడు స్క్రిప్ట్ వినే మూడ్ లేదు. ముందే నో చెప్పడం ఎందుకు ? కథ విన్నాక నటించేందుకు ఇష్టం లేదని చెప్పాలనుకున్నాను.

Dhanush: ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్న హీరో ధనుష్.. మీరు నాలాగా చేయకండి అంటూ రిక్వెస్ట్..
Hero Dhanush
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 16, 2023 | 9:12 PM

డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ్ స్టార్ ధనుష్ నటిస్తోన్న చిత్రం సార్. ఈ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు ఈ హీరో. ఇప్పటికే ధనుష్‍కు ఫుల్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సార్ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా.. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే సెన్సార్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‏గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 15న బుధవారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు డైరెక్టర్ త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ వేడుకలో ధనుష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

“లాక్ డౌన్ సమయంలో వెంకీ అట్లూరి ఈ మూవీ స్టోరీ వినిపించేందుకు నన్ను కలిశారు. అప్పుడు స్క్రిప్ట్ వినే మూడ్ లేదు. ముందే నో చెప్పడం ఎందుకు ? కథ విన్నాక నటించేందుకు ఇష్టం లేదని చెప్పాలనుకున్నాను. కానీ స్టోరీ వినడం పూర్తైన తర్వాత.. నా డేట్స్ ఎప్పుడు కావాలి అని అడిగాను. ఎందుకంటే కథను మించి అందులోని సందేశం నాకు చాలా నచ్చింది. విద్య అనేది గుడిలో పెట్టే నైవేద్యంతో సమానం సర్.. పంచండి.. ఫైవ్ స్టార్ లో డిషెస్ లా అమ్మకండి అనే డైలాగ్ మీరు టీజర్ లోనే విని ఉంటారు. ఈ సినిమా కాన్సెప్ట్ అదే. సందేశంతోపాటు.. కామెడీ కూడా ఈ చిత్రంలో ఉంటుంది. 90ల్లో సాగే కథ ఇది. ” అంటూ చెప్పుకొచ్చారు.

“మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో.. నా పిల్లలను చదివిస్తుంటే అర్థమవుతుంది. కానీ చదుకోవాల్సిన సమయంలో నేను అల్లరి పనులు చేసేవాణ్ని. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్ లో చేరాను. ట్యూషన్ టీచర్ ఎప్పుడూ ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పలేకపోయోవాణ్ని. ఆ తర్వాత కొద్ది రోజులకు నాపై నాకే సిగ్గేసి ట్యూషన్‌ మానేశా అయినా కానీ నా స్నేహితురాలిని కలుసుకునేందుకు బయట వేచి చూసేవాణ్ని. నేను వచ్చినట్టు ఆమెకు తెలియాలని బైక్‌తో సౌండ్‌ చేసేవాణ్ని.

ఇవి కూడా చదవండి

దాంతో, టీచర్‌ నాపై కోప్పడేవారు. మీరంతా బాగా చదువుకుని, పరీక్షలు పాసై ఉన్నత స్థానంలో ఉంటారు. బయట వాహనంతో శబ్దం చేసేవాడు వీధుల్లో డ్యాన్స్‌ చేసుకోవాల్సిందే అని అక్కడున్న వారితో అన్నారట మా టీచర్. ఆయన చెప్పినట్టు తమిళనాడులో నేను డ్యాన్స్‌ చేయని వీధంటూ ఏదీ లేదు వెనక్కి తిరిగి చూస్తే.. నేనెందుకు తరగతులకు వెళ్లలేదు? అని ఇప్పటికీ చింతిస్తున్నా. మీరు నాలాగా చేయకండి” అంటూ అభిమానులను రిక్వెస్ట్ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..