Heroine Roshini: చిరంజీవి ‘మాస్టర్’ సినిమా హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.. వీడియో.
తెలుగు తెరపై ఎందరో బాలీవుడ్ భామలు సందడి చేశారు.. అయితే కొందరు ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం కాగా.. మరికొందరు ఇప్పటికీ వెండితెరపై, బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
తెలుగు తెరపై ఎందరో బాలీవుడ్ భామలు సందడి చేశారు.. అయితే కొందరు ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం కాగా.. మరికొందరు ఇప్పటికీ వెండితెరపై, బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కానీ కొందరు కనుమరుగైనా.. వారి నటన మాత్రం ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసింది. ఆనాటి అందాల తారలు కొందరు ఇటు తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. కానీ తక్కువ సినిమాలకే పరిమితమయ్యారు. వారిలో ఒకరు రాధిక సదనా ఉరఫ్ రోషిణి. ఈ పేరు చెబితే గుర్తుపెట్టుకోవడం కష్టమే. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మాస్టర్’ సినిమా అంటే ఠక్కున గుర్తొస్తుంది.1997లో ‘మాస్టర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రోషిణి. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా తనదైన నటనతో మెప్పించింది. ‘మాస్టర్’ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో రోషిణి కనిపిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈమె.. మరెవరో కాదు హీరోయిన్లు నగ్మా, జ్యోతికల చెల్లెలు. మొదటిగా తమిళంలోకి ‘శిష్యా’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన రోషిణి.. ఆ తర్వాత తెలుగులో చిరంజీవి సరసన ‘మాస్టర్’లో నటించింది. ఇక కన్నడంలోకి ‘గులాబీ’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నగ్మా సోదరి అయిన రోషిణి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. ఆ సమయంలో ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే ఈ హీరోయిన్ నటించిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివసిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!

