Sir Movie: హీరో ధనుష్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఆ స్టార్ హీరో.. ‘సార్’ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్..
ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో 'సార్'(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తమిళ్ స్టార్ హీరోస్ ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే దళపతి విజయ్ వారసుడు సినిమాతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకోగా.. స్టార్ హీరో శివకార్తికేయన్ సైతం ప్రిన్స్ సినిమాతో అలరించారు. ఇక ఇప్పుడు మరో హీరో ధనుష్ తెలుగులోకి అడుగుపెట్టబోతున్నారు. ధనుష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం సార్. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఇదే సినిమాను తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో రిలీజ్ చేయనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. స్టార్ యాక్టర్ ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటించింది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్'(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కథానాయకుడు ధనుష్, కథానాయిక సంయుక్త మీనన్, దర్శకుడు వెంకీ అట్లూరి, డైరెక్టర్ త్రివిక్రమ్, హైపర్ ఆది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రయూనిట్ కు టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ బెస్ట్ విషెస్ చెప్పారు.
అలాగే తమిళ్ యాక్టర్ ధనుష్ తెలుగులోకి గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతుంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
#SIR In cinemas, From Tomorrow!Hearing great things about the film already?? Congrats to my dear Swami #VenkyAtluri & Grand Welcome to @dhanushkraja garu to Telugu. My heartfelt wishes to my hattrick producer @vamsi84 n @sitharaents , each and everyone from the Team #Sir pic.twitter.com/HcYFzxydrt
— nithiin (@actor_nithiin) February 16, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.