Dunki Teaser: బాద్ షా బర్త్ డే ట్రీట్.. ‘డుంకీ’ టీజర్ వచ్చేసింది.. ప్రేమ, స్నేహ బంధాలతో షారుఖ్..
Shah Rukh Khan Birthday: తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ఇందులో షారుఖ్ హార్టీ అనే పాత్రలో కనిపించారు. అతడు తన స్నేహితులతో కలిసి లండన్ కు వెళ్లాలను కోరుకుంటాడు. ఇక అతడి స్నేహితులుగా తాప్సీ, విక్కీ కౌశల్ కనిపించారు. టీజర్ చూస్తుంటే.. పంజాబ్ యువత మంచి జీవితాన్ని వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపించే యువత చుట్టూ డుంకీ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారికి ఎలాంటి సవాల్లు ఎదురవుతాయి. వారి ప్రయాణం ఎలా సాగిందనేది డుంకీ సినిమా. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేమ, స్నేహ బంధాల గొప్పదనం చాటి చెప్పేలా ఉండనున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం డుంకీ. ఈరోజు (నవంబర్ 2న) బాద్ షా పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. బ్లాక్ బస్టర్ హిట్స్ మున్నా భాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ఇందులో షారుఖ్ హార్టీ అనే పాత్రలో కనిపించారు. అతడు తన స్నేహితులతో కలిసి లండన్ కు వెళ్లాలను కోరుకుంటాడు. ఇక అతడి స్నేహితులుగా తాప్సీ, విక్కీ కౌశల్ కనిపించారు. టీజర్ చూస్తుంటే.. పంజాబ్ యువత మంచి జీవితాన్ని వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపించే యువత చుట్టూ డుంకీ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారికి ఎలాంటి సవాల్లు ఎదురవుతాయి. వారి ప్రయాణం ఎలా సాగిందనేది డుంకీ సినిమా. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేమ, స్నేహ బంధాల గొప్పదనం చాటి చెప్పేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే డైరెక్టర్ రాజ్ కుమార్ ఈ సినిమాను వినోదభరితంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
షారుఖ్ ఖాన్ తన స్నేహితులతో కలిసి ఏడాది గుండా వెళ్తూ కనిపిస్తాడు. కానీ వారిపై ఓ అనుమానాస్పద వ్యక్తి కాల్పులు జరుపుతు కనిపిస్తున్నాడు. అలాగే ఎప్పటిలాగే మరోసారి ఈసినిమాతో షారుఖ్ తన కామెడీ టైమింగ్ యాక్టింగ్తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయినట్లుగా టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న కింగ్.. ఇప్పుడు డుంకీ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ 2018లో తెరకెక్కించిన సంజు తర్వాత మళ్లీ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. దీంతో డుంకీ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home! A heartwarming story by a heartwarming storyteller. It’s an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT
— Shah Rukh Khan (@iamsrk) November 2, 2023
భారీ అంచనాల మధ్య రూపొందించిన డుంకీ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ హిరాణీ ప్రజెంటేషన్ బ్యానర్లపై గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ హిరాణి, అభిజాత్ జోషి, కనికా థిల్లాన్ రాసిన ఈ కథను రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
