- Telugu News Photo Gallery Cinema photos Heroine Pooja Hegde waiting for Next Movies updates and new photos goes attractive in social media Telugu Actress Photos
Pooja Hegde: పూజా హెగ్డేకు తప్పని ఎదురు చూపులు.. కానీ గ్లామర్ డోస్ మాత్రం హై..
దేనికైనా టైమ్ రావాలి.. అప్పటి వరకు చేసేదేముండదు ఎదురు చూడటం తప్ప..! ఇప్పుడు పూజా హెగ్డే చేస్తున్నది కూడా ఇదే. ఒకప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. ఇంతకీ పూజా హెగ్డే కమ్ బ్యాక్ ఎప్పుడు..? ఈమె నెక్ట్స్ సినిమాలేంటి..? పాటలో చెప్పినట్లు కెరీర్ కూడా ఉంటే అది సినిమా అవుతుంది కానీ లైఫ్ ఎందుకవుతుంది..?
Updated on: Nov 02, 2023 | 1:46 PM

దేనికైనా టైమ్ రావాలి.. అప్పటి వరకు చేసేదేముండదు ఎదురు చూడటం తప్ప..! ఇప్పుడు పూజా హెగ్డే చేస్తున్నది కూడా ఇదే. ఒకప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ..

ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. ఇంతకీ పూజా హెగ్డే కమ్ బ్యాక్ ఎప్పుడు..? ఈమె నెక్ట్స్ సినిమాలేంటి..? పాటలో చెప్పినట్లు కెరీర్ కూడా ఉంటే అది సినిమా అవుతుంది కానీ లైఫ్ ఎందుకవుతుంది..?

ఎంత పెద్ద హీరోయిన్ కెరీర్‌కైనా ఎక్స్‌పైరీ డేట్ తప్పదు. తాజాగా పూజా హెగ్డే విషయంలోనూ ఇదే జరుగుతుంది. టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఛాన్సుల కోసం చూస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ కంటే బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారు ఈ భామ.. ఖాళీ టైమ్‌ను ఫోటోషూట్స్‌తో వేడెక్కిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ అంటూ అంతా స్టార్స్‌తో జోడీ కట్టారు పూజా.

వాళ్ల నుంచి అవకాశాలు మొండికేయడంతో నెక్ట్స్ లిస్టులో ఉన్న రవితేజ, నితిన్, సాయి తేజ్ లాంటి హీరోల నుంచి పిలుపు వస్తుందని ఆశగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది గాంజా శంకర్‌లో ఈమెకు ఛాన్స్ వచ్చింది.

కానీ షూటింగ్ మొదలవ్వడానికి ఇంకా టైమ్ పడుతుంది. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న కోయి షక్‌తో పాటు రణ్‌వీర్ సింగ్ కొత్త సినిమాలోనూ పూజా హెగ్డే పేరు పరిశీలిస్తున్నారు. గతంలో సర్కస్ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు.

ప్రస్తుతం పూజా ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. అందుకే తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చినా హ్యాపీ.. రాకపోయినా ఓకే అన్నట్లున్నారు ఈ బ్యూటీ. సాయి ధరమ్ తేజ్ సినిమా హిట్టైతే పూజాకు మళ్లీ డిమాండ్ పెరిగే ఛాన్సులున్నాయి.




