- Telugu News Photo Gallery Cinema photos Chiyaan Vikram Thangalaan Movie makeover Look Goes Trending in Social media Telugu Entertainment Photos
Vikram – Thangalaan: విక్రమ్ మేకోవర్ కు అంతా ఫిదా.! మూవీకోసం ప్రాణం పెట్టేసిన విక్రమ్.
ఇంతకంటే కొత్తగా ఏం కనిపిస్తాడులే అనుకున్న ప్రతీసారి దాన్ని మించి కొత్తగా కనిపిస్తున్నారు విక్రమ్. సినిమా సినిమాకు ఈయన మేకోవర్ చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. కాస్త ఆరోగ్యం చూసుకోవయ్యా అని సలహాలు ఇస్తున్నారు. తాజాగా ఈయన నటిస్తున్న తంగలాన్ టీజర్ విడుదలైంది. మరి అదెలా ఉంది.. విక్రమ్ కోరుకుంటున్న విజయాన్ని తీసుకొస్తుందా..? విక్రమ్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు..! కారెక్టర్ డిమాండ్ చేయాలే కానీ ఏం చేయడానికైనా రెడీగా ఉండే నటుడు.
Updated on: Nov 02, 2023 | 1:46 PM

ఇంతకంటే కొత్తగా ఏం కనిపిస్తాడులే అనుకున్న ప్రతీసారి దాన్ని మించి కొత్తగా కనిపిస్తున్నారు విక్రమ్. సినిమా సినిమాకు ఈయన మేకోవర్ చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. కాస్త ఆరోగ్యం చూసుకోవయ్యా అని సలహాలు ఇస్తున్నారు.

తాజాగా ఈయన నటిస్తున్న తంగలాన్ టీజర్ విడుదలైంది. మరి అదెలా ఉంది.. విక్రమ్ కోరుకుంటున్న విజయాన్ని తీసుకొస్తుందా..? విక్రమ్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు..! కారెక్టర్ డిమాండ్ చేయాలే కానీ ఏం చేయడానికైనా రెడీగా ఉండే నటుడు.

అందుకే ప్రయోగాలన్నీ ఈయనతోనే చేస్తుంటారు దర్శకులు. తాజాగా పా రంజిత్ కూడా ఇలాంటి సినిమాతోనే వస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలోని రియల్ ఇన్సిడెంట్స్‌తో తంగలాన్ సినిమా తెరకెక్కిస్తున్నారీయన.

తాజాగా దీని టీజర్ విడుదలైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా 'తంగలాన్' వస్తుంది. మేకింగ్‌లోనే విక్రమ్ గెటప్ చూసి అంతా షాకయ్యారు. తాజాగా టీజర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవు.. కేవలం యాక్షన్‌తోనే 'తంగలాన్' టీజర్ కట్ చేసారు రంజిత్.

ముఖ్యంగా పామును కసితో విక్రమ్ రెండు ముక్కలు చేసే సీన్ అయితే నెక్ట్స్ లెవల్ అంతే. ఇక యుద్ధ సన్నివేశాలు, విజువల్స్ అన్నీ మరో స్థాయిలో ఉన్నాయి. బ్రిటీషర్లు, ఊళ్లో ఉండే తెగకు మధ్య జరిగే యుద్ధమే తంగలాన్ కథ.

టీజర్ చివర్లో విక్రమ్ బంగారు గనులను చూడటం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 'స్వార్థం వినాశనానికి దారి తీస్తుంది, యుద్ధంలో వచ్చే రక్తమే స్వేచ్ఛకు తెర తీస్తుంది' అనే కొటేషన్స్ టీజర్‌లో హైలైట్ చేసారు రంజిత్.

అంటే బ్రిటీషర్లతో స్వేచ్ఛ కోసం తెగ చేసే యుద్ధానికి నాయకుడిగా విక్రమ్ కనిపిస్తున్నారు. జనవరి 26, 2024న తంగలాన్ అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.




