Aishwarya Rai Bachchan: నీలికళ్ల సుందరి అందానికి రహస్యం ఇదే.. విశ్వ సుందరి బ్యూటీ సీక్రెట్స్..
విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్. అందం, అభినయం అమ్మయిగా మారితే ఎలా ఉంటుందంటే.. ఆమె రూపమే కళ్లముందుకు వస్తుంది. ఐదు పదుల వయసులోనూ తరగని అందం ఆమె సొంతం. నవంబర్ 1న ఐశ్వర్య రాయ్ బచ్చన్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆమె అందానికి రహస్యం గురించి తెలుసుకోండి. ఐశ్వర్య ఎప్పుడూ అనేక రసాయన ఉత్పత్తులను ఉపయోగించడాన్ని నమ్మరు. రసాయనాలకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. సహజ సిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగిస్తారని తెలుసా ?..