దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా అలా నిన్ను చేరి. ఈ మధ్యే క్రిష్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. నవంబర్ 10న అలా నిన్ను చేరి విడుదల కానుంది.