ఈరోజుల్లో మామూలు ఫ్లాప్ సినిమా ఇస్తేనే ఆ దర్శకుడి వైపు చూడడానికి హీరోలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అదే పాన్ ఇండియా డిజాస్టర్ ఇస్తే.. దానికి దాదాపు 40 కోట్లకు పైగా నష్టాలు వస్తే.. ఇక ఆ దర్శకుడి వైపు చూడడానికి మన హీరోలు ఇష్టపడతారా..? కానీ అవేమీ తన కెరీర్ పై ప్రభావం చూపించకుండా ఒక దర్శకుడు మాత్రం బాగానే మ్యాజిక్ చేస్తున్నాడు. అతడే సురేందర్ రెడ్డి. ఏజెంట్ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద డిజాస్టర్ అయింది.