Sara Ali Khan: శుభమన్ గిల్‌తో సారా అలీఖాన్ డేటింగ్ ?.. ఆసక్తికర కామెంట్స్ చేసిన పటౌడీ క్వీన్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా.. క్రికెటర్ శుభమన్ గిల్‌తో డేటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారంటూ విలేకరి ఆమెను అడగారు. పెళ్లిని ఉద్దేశిస్తూ.. వ్యక్తిగత జీవితంలో మీ నాన్నమ్మ షర్మిలా ఠాకూర్ ను అనుసరిస్తారా ? అని అడిగారు. నిజానికి సారా నాన్నమ్మ క్రికెటర్ మన్సూర్ ను వివాహం చేసుకున్నారు. ఇదే విషయాన్ని పరొక్షంగా ప్రస్తావించారు రిపొర్టర్.

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ సారా అలీ ఖాన్. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ఈ చిన్నది.. ఇటీవలే జరా హత్కే జరా బచ్కే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో కొద్ది రోజులుగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రెషన్లలో మునిగితేలుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా.. క్రికెటర్ శుభమన్ గిల్‌తో డేటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారంటూ విలేకరి ఆమెను అడగారు. పెళ్లిని ఉద్దేశిస్తూ.. వ్యక్తిగత జీవితంలో మీ నాన్నమ్మ షర్మిలా ఠాకూర్ ను అనుసరిస్తారా ? అని అడిగారు. నిజానికి సారా నాన్నమ్మ క్రికెటర్ మన్సూర్ ను వివాహం చేసుకున్నారు. ఇదే విషయాన్ని పరొక్షంగా ప్రస్తావించారు రిపొర్టర్.
దీనిపై సారా స్పందిస్తూ.. “నా మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా అతడితో జీవితాన్ని మొదలుపెడతాను. అతడు ఏ రంగానికి చెందనివాడనేది పెద్దగా పట్టించుకోను. క్రికెటర్, నటుడు, వ్యాపారవేత్త, ఇలా రంగం ఏదైనా పర్వాలేదు. నా విలువలను గౌరవిస్తే చాలు” అని చెప్పుకొచ్చింది. అలాగే క్రికెటర్ తో డేటింగ్ ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. “నా జీవిత భాగస్వామిని నేనింకా కలవలేదు. కలిశానని కూడా అనుకోవడం లేదు. ఇది మాత్రం పూర్తి భరోసాతో చెబుతున్నాను” అని తెలిపారు.




సారా, విక్కీ కౌశల్ హీరోహీరోయిన్లుగా నటించిన జరా హాట్కే జరా బచ్కే సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 2న అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు రూ. 30 కోట్లు వసూలు చేసింది.




